*మూడు రోజులు అలర్ట్ గా ఉండాలి…
*అతి భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోండి: సీఎం రేవంత్ …
*అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి…
*ఎక్కువ ప్రభావిత జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించండి..
*కేంద్రంతో మాట్లాడి ఆర్మీ,హెలికాప్టర్లను సిద్ధం చేసుకోవాలి..
*ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలి…
*వీడియో కాన్ఫరెన్స్‌లో లో కలెక్టర్లకు ఆదేశాలు..
*అతి భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలి: సీఎం రేవం రెడ్డి ఆదేశం…

BB6 TELUGU NEWS 13 Aug 2025 : రాష్ట్రంలో రాబోయే72 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐటీ కంపెనీల ఉద్యోగులకు వీలైతే వర్క్ ఫ్రమ్‌హోమ్ సౌకర్యం కల్పించాలని, అప్పుడు రోడ్లపై రద్దీ తగ్గుతుందని సూచించారు.స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించే విషయాన్ని కూడా పరిశీలించాలని విద్యా శాఖ అధికారులకు చెప్పారు.
హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు,ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక ఆదేశాలు జారీచేశారు. “అన్ని శాఖల అధికారులు,సిబ్బంది సెలవులు రద్దు చేసుకుని విధులకు హాజరుకావాలి. క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలి. శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలి.

హెల్ప్ లైన్ నంబర్‌ను అందుబాటులో తీసుకురావాలి. ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లొద్దు. క్లౌడ్ బరస్ట్ జరిగినా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. నిరుడు ఖమ్మంలో భారీ వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇలారిపీట్ కాకుండా చూడాలి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. వారి కోసం పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలి.అవసరమైన ఆహారం, మందులు అందుబాటులో ఉంచాలి”అని కలెక్టర్లకు సీఎం రేవంత్ సూచించారు. భారీ వర్షాలు కురిసే జిల్లాలకు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్‌లను తరలించాలన్నారు. వర్షాలపై ఎప్పటికప్పుడు వాస్తవ సమాచారాన్ని మీడియా ద్వారా ప్రజలకు అందించే బాధ్యత ఐ అండ్ పీఆర్ దే అని తెలిపారు.
మూడు కమిషనరేట్ల పోలీసులు సమన్వయంతో పని చేయాలి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండక మిషనరేట్ల పరిధిలోని పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సీఎంరేవంత్ అన్నారు. “వర్షపు నీరు నిలిచే ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రించాలి. లాఅండ్ ఆర్డర్ పోలీసులు ట్రాఫిక్సిబ్బందితో కలిసి పని చేయాలి. మూసీనది పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలి. ఫిజికల్ పోలీసింగ్పెంచాలి. ఉన్నతాధికారులందరూ ఫీల్డ్‌లోనే ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుండాలి. పాత బిల్డింగ్‌లో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలి.ఎమర్జెన్సీ కాల్స్ కు రెస్పాండ్ కావాలి.సమస్యను వెంటనే పరిష్కరించాలి. వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలి. మందులు,డాక్టర్లను అందుబాటులో ఉంచుకోవాలి.కోఆర్డినేషన్ కోసం చీఫ్ సెక్రటరీ, డీజీపీ,కమిషనర్లు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. గ్రూప్ డిస్కస్ చేసి ఆదేశాలివ్వాలి. మంత్రులు అందుబాటులో ఉంటారు. ట్రాఫిక్, మూసీ నాలాల సమస్యలను పర్యవేక్షిస్తారు”అని సీఎం రేవంత్ తెలిపారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు.
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించాలని సీఎస్ ను సీఎం రేవంత్ ఆదేశించారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని ఆర్మీ, హెలికాప్టర్ల హెల్ప్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. “పశు సంపద నష్టపోతే ఎఫ్ఎస్ఐఆర్నమోదు చేసి బాధితులకు పరిహారం అందేలా చూసే బాధ్యత పశుసంవర్ధకశాఖ అధికారులదే. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలి.మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవా లి. ఇరిగేషన్ శాఖ అధికారులు.. వాటర్ లెవల్స్‌ను మానిటర్చేస్తూ గేట్లు లిఫ్ట్ చేయాలి”అని రేవంత్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లోమంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డివెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు,పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.