జిల్లా స్థాయిలో అసైన్డ్ కమిటీలు..
అసైన్డ్ భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర
సర్కారు చర్యలు.
జిల్లా ఇన్చార్జి మంత్రి చైర్మన్,కలెక్టర్ కన్వీనర్గా త్వరలో కమిటీలు.
అసైన్డ్ చేసి 20 ఏండ్లు పూర్తైన భూ యజమానులకు శాశ్వత హక్కులు?
కొత్తగా భూముల గుర్తింపు,పంపిణీపైనా అసైన్డ్ కమిటీలు ఫోకస్ .
అన్యాక్రాంతమైన భూములపై నావీటి నిర్ణయమే ఫైనల్ .
సీఎం రేవంత్ త్వరలోనే డెసిషన్ దగ్గరకు చేరిన
ఫైలు..
ఆమోదం పొందితే ఏండ్ల సమస్యకు పరిష్కారం
BB6 TELUGU NEWS 12 Aug 2025 : అసైన్డ్ భూములసమస్యల పరిష్కారంపై రాష్ట్ర సర్కారుఫోకస్పెట్టింది. ఇందులో భాగంగా జిల్లా స్థాయిలో అసైన్డ్ కమిటీల ఏర్పాటుకు తాజాగా గ్రీన్ సిగ్నల్ అచ్చింది. ఇప్పటికే పంపిణీ చేసిన అసైన్డ్ భూములకు సంబంధించి, అర్హులైనవారికి యాజమాన్య హక్కులు కల్పించడంతో పాటు కొత్తగా భూముల పంపిణీకి ఈ కమిటీలు చర్యలు తీసుకుంటాయి. అన్యాక్రాంతమైన భూములపైనా అసైన్డ్ కమిటీల నిర్ణయమే కీలకం కానున్నది. ఈ మేరకు రెవెన్యూశాఖ రూపొందించిన ఫైలు సీఎం కార్యాలయానికి చేరింది. అసైన్డ్ చేసి 20ఏండ్లు పూర్తైన భూములకు హక్కులు కల్పించాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. దీంతో చేతిలో అసైన్డ్ పట్టాలు, మోకా మీద భూమి ఉండి యాజమాన్య హక్కులు లేనివారు, రికార్డుల్లో భూమి ఉన్నా ఫీల్డ్ లో లేక ఇబ్బందులు పడ్తున్న రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. అదే సమయంలో కొత్త భూముల గుర్తింపు, పంపిణీకి సర్కారు సిద్ధమవుతున్నట్లు తెలిసి భూములు లేని నిరుపేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి.