మందమర్రి బి1 ఆఫీస్ లో చెన్నూరు నియోజక వర్గ అధికారులతో మీటింగ్ నిర్వహించిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి.

మంచిర్యాల జిల్లా BB6 TELUGU NEWS  : 10 Aug 2025 : మందమర్రి బి1 ఆఫీస్ లో చెన్నూరు నియోజక వర్గ అధికారులతో కలసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు,అభివృద్ధి పథకాల పురోగతి పై రివ్యూ మీటింగ్ నిర్వహించిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి.
ఇందిరమ్మ ఇండ్లు,రేషన్ కార్డులు, రోడ్లు డ్రైనేజీలు పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ పై పంచాయతీ రాజ్,మున్సిపల్, రెవిన్యూ అధికారులతో రివ్యూ మీటింగ్.
తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి వివేక్ వెంకటస్వామి.గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధిని పట్టించుకోలేదు
విద్య వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కి వచ్చిన వెంటనే 10 వేల టీచర్స్ పోస్టులు భర్తీచేశాం.

నియోజకవర్గంలో 200 వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్  స్కూల్లో తీసుకువచ్చాం

ప్రభుత్వ పాఠశాలలు ,కళాశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందని ఈ ఆకా డామిక్ ఇయర్లో 70 శాతం అడ్మిషన్లు పెరిగింది.

సింగరేణి సంస్థలో కొత్త గనులు కొత్త ఉద్యోగాలు తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది..

కొత్త గనుల టెండర్ లో సింగరేణి సంస్థ టెండర్ లో పాల్గొనే  లా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది.

స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించేవిధంగా చర్యలు చేపడుతున్నాం.

బీహార్ లో ఒక్కొక్క నియోజకవర్గంలో లక్ష దొంగ ఓట్లు నమోదు అయ్యాయని రాహుల్ గాంధీ మీడియా ముందు ప్రవేశపెట్టారు.

ఎలక్షన్ కు సంబంధించిన ఓటర్ జాబితాను ఇవ్వమని ఎలక్షన్ కమిషన్ ను రాహుల్ గాంధీ కోరితే ఎలక్షన్ కమిషన్ డేటా డిలీట్ చేశామని చెప్పడం విడ్డూరంగా ఉంది.

తెలంగాణ ప్రజల సొంతింటి కల ఆకాంక్షను గత బిఆర్ఎస్ ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తున్నాం..

చెన్నూరులో 3800 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశాం.

చెన్నూరు నియోజక వర్గ ప్రజలకు తాగి నీటి కష్టాలను తీర్చేందుకు 100 కోట్లతో అమృత్ స్కీమ్ పనులు కొనసాగుతున్నాయి.

చెన్నూరు నియోజక వర్గంలో ఇసుక మాఫియా,భూదందాలకు చెక్ పెట్టినం.

లక్ష కోట్ల తో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కమీషన్ లకే పరిమితమైంది. కానీ అవే లక్ష కోట్లతో  తెలంగాణలోని నీరు పేదలందరికీ  డబుల్ బెడ్రూం ఇండ్లు వచ్చేవి.

కేవలం కమిషన్ల కోసమే గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు చేపట్టింది.

దేశంలో ఎన్నికల సరళినీ ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పద్ధతిలో కొనసాగించాలని ఎన్నిల కమిషన్ ను రాహుల్ గాంధీ కోరితే బిజెపి తప్పు పడుతుంది.

ఈవీఎం మిషన్లు ఎన్నికల సమయంలో హ్యాక్ అవుతున్నాయి.

ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో అవకతవకలకు తావులేకుండా బ్యాలెట్ పద్ధతి నీ ప్రవేశ పెట్టాలని అన్ని పార్టీలు కోరుతున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe