BB6 TELUGU NEWS 10 Aug 2025 :
రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖకేంద్ర ప్రభుత్వరంగసంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ)ముందు కొచ్చింది. సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకురూ.80 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని వెల్లడించింది.
తెలంగాణలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులకు సుముఖంగా ఉన్నట్టు ఎన్టీపీసీ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారికి తెలియజేసింది. ఎన్టీపీసీ (NTPC) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి గారితో మర్యాదపూర్వకంగా భేటీ అయింది.
రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులకు ఎన్టీపీసీ సుముఖంగా ఉన్నట్లు ఈ సందర్భంగా ఆ ప్రతినిధి బృందం తెలిపింది. ప్రధానంగా సోలార్, విండ్ విద్యుత్ ప్రాజెక్టుల్లో దాదాపు 80 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్ గారు వివరించారు.
ఫ్లోటింగ్ సోలార్ ఉత్పత్తికి సంబంధించి రాష్ట్రంలో 6,700 మెగావాట్ల సామర్థ్యానికి అవకాశం ఉందని వివరించగా, రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం ఎన్టీపీసీకి అన్ని విధాలా సహకరిస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు.

BB6 న్యూస్ ఛానల్ లో ప్రమోషన్ ( ప్రకటనలు ) కోసం సంప్రదించండి.
వాట్సాప్ లో మీ వివరాలు మెసేజ్ చేయండి 9640088223.. మేము కాల్ చేస్తాము..