BB6 TELUGU NEWS ఆగస్టు 9 2025 :
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్దిదారులకు విడుదల చేసే బిల్లుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై ఈ చెల్లింపులకు ఆధార్ అనుసంధాన ప్రక్రియను (ఆధార్ పేమెంట్ బిల్ సిస్టం) ద్వారా నిర్వహించనున్నామని హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ శ్రీ వి.పి గౌతం తెలిపారు. విడతల వారీగా విడుదల చేస్తున్న బిల్లులు సకాలంలో లబ్దిదారులకు అందేలా చూడటంలో ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు.
ఈ నిర్ణయం వల్ల లబ్దిదారులకు బ్యాంకుల ద్వారా చెల్లింపులు జరగడం లేదన్న ఫిర్యాదులు గణనీయంగా తగ్గిపోతాయన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు, వారి ఇళ్ల నిర్మాణపు దశనుబట్టి ఆన్ లైన్ ద్వారానే విడతల వారీగా బిల్లుల రూపంలో మొత్తంగా రూ.5 లక్షలను అందచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఇంతవరకు సుమారు 590 కోట్ల రూపాయలను లబ్దిదారులకు అందచేశారు. ఇటీవలి కాలంలో లబ్దిదారుల నుంచి తమకు విడుదలైన బిల్లుల మొత్తాలు ఖాతాల్లో జమ కావడం లేదన్న ఫిర్యాదు
