BB6 TELUGU NEWS 8 Aug 2025 : వినాయకచవితి పర్వదినం రానే వస్తోంది. దీనితో ఎక్కడ చూసినా గణనాధులు కనిపిస్తున్నారు. ఈ క్రమంలో వికారాబాద్ జిల్లా, కుల్కచర్ల మండలం చాపల గూడెం గ్రామంలో, ఎక్కువగా మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వ్యాపారులు కూడా ఎక్కువగా, మట్టి విగ్రహాలను విక్రయిస్తున్నారు. అయితే అనేక రసాయనాలు ఉపయోగించిన, వినాయక విగ్రహలను వాడటం వల్ల ,నీరు కలుషితమౌతుంది. దీని ద్వారా పర్యావరణానికి హాని జరుగుతుందని ,పర్యావరణ వేత్తలు తెలుపుతున్నారు. ఈ అంశంపై ప్రజల్లో ప్రస్తుతం చైతన్యం రాగా, అందరూ కూడా మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకు మండపానికి కావాల్సిన సైజులో, వినాయక విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా వినాయక విగ్రహాలను ,జిల్లాలో 1 నుంచి 2 అడుగుల, మట్టి విగ్రహాలను తయారు చేయగలరు. కానీ ఎక్కువ అడుగుల విగ్రహాలు కావాలనుకుంటే, ఖచ్చితంగా వాటికి సంబంధించిన ఫ్రేమ్స్ కావాలి. దానికి అనుగుణంగా, మట్టి కూడా జిగురు ఉండాలి. ప్రస్తుతం జిల్లాలో అటువంటివి అందుబాటులో లేవు. కాబట్టి చెరువులలో లభించే మట్టిని సేకరించి ,కుండల తయారీకి ఉపయోగించే మట్టి నీ తెప్పించి ,ఎంతో శ్రమతో ఈ గణపయ్య మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నారు. తయారైన విగ్రహాలకు కావాల్సిన, మెరుగులు దిద్ది ,మార్కెట్ లో విక్రయిస్తున్నారు. ఈ మట్టి విగ్రహాల వల్ల ,పర్యావరణానికి ఎటువంటి హాని జరగకుండా ఉంటుందని వ్యాపారస్తులు, బి బి సిక్స్ తెలుగు న్యూస్ ఛానల్ తో తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో , విగ్రహాలు పర్యావరణానికి హని కల్గిస్తాయని, ఈ విగ్రహాలు రథం మీద వచ్చే వినాయకుడు, ఎలుక మీద వచ్చే వినాయకుడు , ఏనుగు వాహనాలు, నందులుగా అన్ని రకరకాల మోడల్స్ ని, మార్కెట్లో విక్రయిస్తున్నట్లు. 2018 నుండి కుల్కచర్ల మండలం ,చాపల గూడెం గ్రామంలో విగ్రహాలను తయారు చేస్తున్న ,కుమ్మరి గోపాల్ (9912896445) వ్యాపారస్తుడు తెలిపారు.
BB6 న్యూస్ ఛానల్ లో ప్రమోషన్ ( ప్రకటనలు ) కోసం సంప్రదించండి.వాట్సాప్ లో మీ వివరాలు మెసేజ్ చేయండి 9640088223.. మేము కాల్ చేస్తాము..
అందమైన మట్టి విగ్రహాల తయారీ చాపల గూడెం గ్రామం కుల్కచర్ల

08
Aug