BB6 TELUGU NEWS : 6 Aug 2025 :
ఈరోజు మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు అంగడి అరుణ దేవి మాట్లాడుతూ
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆగస్టు 6 1934 సంవత్సరం హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో లక్ష్మీకాంతరావు మహాలక్ష్మి దంపతులకు జన్మించాడు తెలుగు ఉర్దూ హిందీ ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి పట్టా పొంది ప్రిన్సిపాల్ గారి రిజిస్టర్ గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్గా ఉన్నత పదవులు పొందారు 1969 తెలంగాణ ఉద్యమంలో అంతకుముందు నాన్ ముల్కి ఉద్యమంలో సాంబార్ ఇడ్లీ గో బ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఎన్నో పుస్తకాలు రాశాడు జయశంకర్ తన జీవితాన్ని ఆస్తిని తెలంగాణ కోసం అంకితం చేశాడు ఇప్పుడైతే నాకు ఒకే కోరిక మిగిలింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల్లారా చూడాలి తర్వాత మరణించాలి అనేవాడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల పట్ల అసమానతుల పట్ల తీవ్రంగా పోరాటం చేశాడు రెండు సంవత్సరాల పాటు ఇంద్ర గొంతు క్యాన్సర్ తో బాధపడి 2011 సంవత్సరం జూన్ 21 తేదీన తుది శ్వాస విడిచారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అంగడి అరుణ దేవి, ఉపాధ్యాయులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, బి.మల్లేష్, కె. వెంకటయ్య, కె. సికిందర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ 91 వ జయంతి

06
Aug