విద్యార్థులకు పౌష్టిక ఆహారం అవసరం
కుల్కచల్ల మండల ప్రభుత్వ వైద్య అధికారి డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్

వికారాబాద్ జిల్లా పరిగి నిజ వర్గంలోని కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్పూర్ గ్రామంలోని మాడల్ స్కూల్ ను ప్రభుత్వ వైద్య అధికారి డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్ విజిట్ చేయడం జరిగింది ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు అందరికీ నాణ్యమైనటువంటి పౌష్ఠికాహారం డైట్ మెనూ ప్రకారం అందించాలి తెలియజేశారు విద్యార్థులకి అందిస్తున్న భోజనo మరియు డైట్ మెనూ గురించి ఆరా తీయడం జరిగింది అన్ని పరిశీలించిన అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేయడం జరిగింది ..పౌష్టికాహారం అమలు గురించి స్టాఫ్ కి పలు సూచనలు చేయడం జరిగింది.అనంతరం 100 మంది విద్యార్థులకు హెల్త్ స్క్రీనింగ్ చేసి 20 మంది విద్యార్థులు అనారోగ్యం తో ఉనట్లు గుర్తించి వారికి మందులు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ అంజి నాయక్, ఎం ఎల్ హెచ్ పి అరుణ ,ఏఎన్ఎం రత్న, ఉపాధ్యాయులు ,ఆశ వర్కర్లు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు