సిట్ విచారణకు హాజరైన ప్రవీణ్ కుమార్.ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు.

BB6 TELUGU NEWS 28-july-2025:
ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా విచారణ జరుపుతున్న సిట్ అధికారులు ఇటీవల విచారణకు హాజరుకావాలని బి ఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి నోటీసులు ఇచ్చారు.
నోటీసులకు స్పందించి, ఈ రోజు జూబ్లి హిల్స్ పోలీస్ స్టేషన్ లోని  సిట్ ఆఫీసులో హాజరయ్యారు.
విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ
రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు చేశాను.
రేవంత్ రెడ్డి సొంత పార్టీ మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు.
పెగాసెస్ వంటి సాఫ్ట్ వేర్ సహాయంతో మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు .
డార్క్ వెబ్ లో కొన్ని అరుదైన టూల్స్ వాడి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు.
అందుకే రేవంత్ రెడ్డి చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చేయాలి.
రేవంత్ రెడ్డిని కూడా విచారణకు పిలవాలని డిమాండ్.

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుండి బయటికి వస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్

రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విచారించే వరకు పోరాడుతామని హెచ్చరిక.
రేవంత్ రెడ్డి చేసే ఫోన్ ట్యాపింగ్ కు,కేంద్రంలో ఉన్న  బిజెపి ప్రభుత్వం  మద్దతు కూడా ఉంది.
రెండు పార్టీలు కలిసే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. మంత్రులతో పాటు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు,జర్నలిస్టుల ఫోన్లు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ట్యాప్ చేస్తున్నట్టు ఆరోపణ.సౌత్ ఫస్ట్ పోస్ట్ లో ప్రచురించబడిన వార్తల ఆధారంగా ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు.త్వరలో ఫిర్యాదు హైదరాబాద్ పోలీస్ కమీషనర్ కి కూడా ఇస్తామని, విచారణకు సిఎం ను కూడా పిలవాలని కోరుతామన్నారు.ముఖ్యమంత్రి మరియు హోం మంత్రిగా రేవంత్ రెడ్డి సిట్ ను వాడుకొంటున్నారు.

ఆర్ఎస్ ప్రవీణ్

రేవంత్ రెడ్డి ప్రతీకార పాలనలో భాగంగా  సిట్ ను పావుగా వాడుకుంటున్నారు.రేవంత్ రెడ్డి ప్రతీకార పాలనలో పోలీసు అధికారులు సమిధలు కావద్దని సూచన.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీల అమలుపై ప్రశ్నిస్తున్నందుకు, పోరాటం చేస్తున్నందుకు బిఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయాలని కుట్రలో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసును తెర మీదికి తెచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ కు మరియు బిఆర్ఎస్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం. కేసిఆర్ ప్రజలను నమ్ముకొని,ఆయన చేసిన మంచి పనులు నమ్ముకొని పని చేశారు కానీ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడలేదని తెలిపారు.
సిట్ విచారణలో భాగంగా అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పాను.
చట్టాన్ని గౌరవించి సిట్ విచారణకు హాజరయ్యానని పేర్కొన్నారు.

Related News

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe