BB6 TELUGU NEWS 28-july-2025
పహల్గామ్ లో అమాయక టూరిస్టులను చంపిన ముగ్గురు ఉగ్రవాదులను భారత బలగాలు హతమార్చాయి.. ఆర్మీ , సీఆర్‌పీఎఫ్ , జమ్ముకశ్మీర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురిని కాల్చి చంపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు ఆసిఫ్ ఫౌజీ , సులేమాన్‌షా, అబూ తల్హా హతమయ్యారు.
పహల్గామ్ దాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. శ్రీనగర్ లోని హర్వాన్-లద్వాస్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ మహదేవ్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు సైన్యం ప్రకటించింది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఆపరేషన్ మహదేవ్‌ను ప్రారంభించారు. సంచార జాతులు ఇచ్చిన సమాచారంతో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి.ఆపరేషన్ మహదేవ్‌లో ఇద్దరు ఉగ్రవాదులకు గాయాలయ్యాయి. ఆర్మీ , సీఆర్‌పీఎఫ్ , జమ్ముకశ్మీర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదులపై ఒక్కొక్కరి మీద రూ. 20 లక్షల రివార్డు ఉన్నట్టు తెలుస్తోంది. ఆసిఫ్ ఫౌజీ , సులేమాన్‌షా , అబూ తల్హా అనే ఉగ్రవాదులు చనిపోయినట్టు తెలుస్తోంది. పహల్గామ్ దాడిలో 26 మంది టూరిస్టులను కాల్చిచంపారు ఉగ్రవాదులు. TRF ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు పహల్గామ్‌లో మారణహోమానికి పాల్పడ్డారు.
ఓవైపు లోక్‌సభలో ఆపరేషన్ సింధూర్‌పై చర్చ జరుగుతున్న వేళ్ల పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్ ప్రాధాన్యతను సంతరించుక్ఉంది. ఈ ఘటన తరువాత శ్రీనగర్‌లో హైఅలర్ట్ ప్రకటించారు.
కాగా.. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆపరేషన్ సింధూర్ అంటూ ప్రతిదాడికి దిగింది భారత్.. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఖచ్చితమైన దాడుల ద్వారా రివేంజ్ తీర్చుకుంది.
Pahalgam Terrorist Attack: ఆపరేషన్ మహదేవ్.. పహల్గామ్‌లో టూరిస్టులను చంపిన ముగ్గురు ఉగ్రవాదులు హతం..

28
Jul