BB6 TELUGU NEWS 26 July 2025 :
భైతాపురంలో డివైడర్ ను ఢీకొట్టి ఆ తర్వాత లారీని ఢీకొట్టిన స్కార్పియో.. లారీ సడెన్ బ్రేక్ వేయడంతో తప్పించబోయి డివైడర్ ను ఢీకొట్టిన స్కార్పియో.. ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మేక చక్రధర్ రావు, శాంతారావు మృతి.. ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ లో పని చేస్తున్న అధికారులు.. అడిషనల్ ఎస్పీ కేవీఎస్ ప్రసాద్, డ్రైవర్ నర్సింగ్ కు గాయాలు.
చౌటుప్పల్: యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపూర్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.మృతులు ఇద్దరూ ఏపీకి చెందిన డీఎస్పీలు చక్రధర్రావు,శాంతారావుగా గుర్తించారు. విజయవాడ నుంచి హైదరాబాదుకు వస్తున్న స్కార్పియో అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి.. రోడ్డు అవతలివైపు పడింది. అటుగా వస్తున్న లారీ.. స్కార్పియోను ఢీకొట్టడంతో వాహనం ముందు భాగం నుజ్జునుజ్జయింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదంలో ఏఎస్పీ ప్రసాద్, డ్రైవర్ నర్సింగరావుకు తీవ్ర గాయాలయ్యాయి.
నర్సింగరావును ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులిద్దరూ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఓకేసు విషయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.