తెలంగాణలో వరుసగా పండుగలు, వర్గాల కారణంగా విద్యార్థులకు సెలవులు వస్తున్నాయి. జూలై 23వ తేదీన కూడా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉండ నుంది.స్కూళ్లకు సెలవు తెలంగాణలో విద్యార్థులకు మరో రోజు సెలవురానుంది. విద్యా రంగంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలకు నిరసనగా తెలంగాణలోని వామపక్ష విద్యార్థి సంఘాలు జూలై 23న బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు,జూనియర్ కళాశాలల బంద్కు పిలుపునిచ్చాయి.రాష్ట్ర ప్రభుత్వం నుండి తక్షణ సంస్కరణలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.తెలంగాణలోని పాఠశాలలు, కళాశాలలు మరియు అన్ని విద్యాసంస్థలు రేపు బంధుగా ఉంటాయి. దీని కారణంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి అనేక ప్రైవేట్ పాఠశాలలు,కళాశాలలు సెలవు ప్రకటించాయి.
ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF),స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI),పీడీఎస్ యూ, ఏఐవైఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా బందూకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వం పట్టించు కోవడంలేదని.. అందుకే బంద్కు పిలునిచ్చినట్టుగాసంఘాలు తెలుపుతున్నాయి. విద్యార్థి సంఘాలుఅనేక కీలక డిమాండ్లు ఉన్నాయి.
విద్యార్థి సంఘాల డిమాండ్లు ప్రైవేట్ విద్యా సంస్థలు వసూలు చేసే ఫీజులను నియంత్రించడానికి, పరిమితం చేయడానికి చట్టం ప్రవేశపెట్టడం. విద్య రంగంలో పనితీరు,సంస్కరణలను పర్యవేక్షించడానికి అంకితభావంతో కూడిన మంత్రిని నియమించాలి. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, మండల విద్యా అధికారులు(MEOలు), మరియు జిల్లా విద్యా అధికారులు(DEOలు) పోస్టులకు తక్షణ నియామకాలు చేయాలి.
మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రాథమిక విద్యకుమించి విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు జూనియర్ కళాశాలల్లో ఈ పథకాన్ని అమలుచేయాలి. విద్యార్థులకు చెల్లించాల్సిన అన్ని స్కాలర్షిప్ బకాయిలను మరింత ఆలస్యం చేయకుండా చెల్లించాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. వీటితో పాటు మరికొన్ని డిమాండ్లతో విద్యార్థి సంఘాలు బందూకు పిలుపునిచ్చాయి
బుధవారం తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకుసెలవు.. కారణమేంటో తెలుసా?

23
Jul