ఫ్రిజ్‌లో ఉంచిన మాంసాహారం వేడిచేసి తిని.. ఒకరి మృతి, ఏడుగురికి అస్వస్థత

ఫ్రిజ్‌లో ఉంచి వేడి చేసిన మాంసాహారం తినడంతో ఒకరు మృతి చెందగా మరో ఏడుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన నగరంలోని వనస్థలిపురం పీఎస్‌ పరిధి చింతల్‌కుంటలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్‌కుంట ఆర్టీసీ కాలనీలో నివాసముంటున్న శ్రీనివాస్‌ యాదవ్‌ (46) ఆదివారం బోనాల పండగ సందర్భంగా ఇంటికి మటన్‌ బోటి, చికెన్‌ తీసుకొచ్చారు. ఆ రాత్రి వండుకుని కుటుంబ సభ్యులు తిన్నారు. మిగిలిన మాంసాన్ని ఫ్రిజ్‌లో పెట్టారు. సోమవారం ఆ మాంసాన్ని వేడి చేసి మళ్లీ తిన్నారు. ఆహారం విషపూరితం కావడంతో కుటుంసభ్యులందరికీ వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో సమీపంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం శ్రీనివాస్‌యాదవ్‌ మృతిచెందారు. మిగిలిన ఏడుగురు చికిత్స పొందుతున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe