Rain Alert: బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. తెలుగు రాష్ట్రాలకు వానలే వానలు. పిడుగులు పడే ప్రమాదం.

తెలుగు రాష్ట్రాలకు వానలే వానలు.. పిడుగులు పడే ప్రమాదం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు.. ఇక ఇవాళ్టి వెదర్‌ అప్‌డేట్‌ ఏంటంటే? వచ్చే మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా.. ఆ వివరాలు ఇలా..
దక్షిణ ఒడిస్సా దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్రం మట్టం నుంచి 5.8 కి మీ ఎత్తు వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. 13 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి ఉత్తర మధ్య కర్ణాటక మీదుగా దక్షిణ కోస్తా ఆంధ్రా తీరం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిమీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. రాగల మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
అమరావతి వాతావరణ కేంద్రం మరోసారి ఏపీకి భారీ వర్ష సూచన చేసింది. అల్లురి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు.. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
అటు తెలంగాణకు భారీ వర్షసూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. ఈ రోజు(మంగళవారం) తెలంగాణలోని 18 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా.. మరో 12 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో మోస్తారు వర్షాలు కురుస్తాయి. అలాగే అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe