నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా కదులుతున్నాయి. బంగాళాఖాతంలో గురువారం నాటికి అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో పాటు బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాబోయే ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురు గాలులతోపాటు.. ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని అలర్ట్ జారీ చేసింది.
నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా కదులుతున్నాయి. బంగాళాఖాతంలో గురువారం నాటికి అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో పాటు బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాబోయే ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురు గాలులతోపాటు.. ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని అలర్ట్ జారీ చేసింది. అమరావతి వాతావరణ కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లో 12 జిల్లాలకు వర్ష సూచన చేసింది.. పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఆదివారం అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి-మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.
తెలంగాణలో ఆదివారం, సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. 9 జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది.. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. వాయువ్య, దాని సమీపంలోని ఈశాన్య రాజస్థాన్ ప్రాంతంలో ఉన్న వాయుగుండ కేంద్రం మీదుగా ఈశాన్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుంది. దక్షిణ కర్ణాటక నుండి దక్షిణ కోస్తా ఆంధ్ర తీరం వరకు సగటు సముద్రమట్టం నుండి 5.8 కి మీ మధ్యలో ఉపరితల ద్రోణి కొనసాగుతుంది.
ఆదివారం తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం తెలంగాణలోని అన్ని జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు.
Heavy Rain Alert: ఏపీ, తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

20
Jul