హైదరాబాద్ కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున తిరుపతి రబ్బర్ కంపెనీలో మంటలు చెలరేగాయి. రబ్బర్ ఉత్పత్తులు కావడంతో మంటలు వేగంగా వ్యాపించి దట్టమైన పొగ కమ్ముకుంది, దీంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అదృష్టవశాత్తు, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు.
ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి శ్రమిస్తున్నారు. ప్లాస్టిక్, రబ్బర్ ఉత్పత్తులు కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అగ్నిమాపక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు. అయితే ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు, భయాందోళనలో స్థానికులు

03
Jul