తెలంగాణలో పలుచోట్ల వర్షంకొన్ని చోట్ల లోతట్టుప్రాంతాలు జలమయం. పలుచోట్ల రోడ్లపై నిలిచిన వర్షం నీరు

బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు
గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
ఏపీలో పలుప్రాంతాల్లో మోస్తరు వానలు
ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు.

BB6 TELUGU NEWS CHANNEL రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధ,గురువారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి.ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల,జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంజిల్లాల్లో బుధవారం వర్షాలు కురవనున్నాయి.రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి.హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం పడనుంది. ఈ మేరకు హైదరాబాద్వాతావరణ కేంద్రం మంగళవారం ప్రకటన విడుదలచేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe