BB6TELUGUNEWSCHANNEL: తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు,నాలుగు రోజుల పాటు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక,ఇప్పటికే ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఈవర్షాలతో రైతులకు మేలు జరగనుంది.బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.శాఖ తెలిపింది. ఇప్పటికే బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా- పశ్చిమబెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని..అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో పాటు మరో ద్రోణి విస్తరించి ఉందని వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులుఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులు తెలిపారు.
వాయువ్య బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని apsdma ఎండీ ప్రఖర్ జైన్వెల్లడించారు. నాలుగు రోజులు చెదురుమదురుగా పిడుగులతోకూడిన భారీ వర్షాలు,40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తెలుగు రాష్ట్రాలలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు. అల్పపీడనం ఏర్పడే అవకాశం

26
Jun