కస్టమర్లను ఆకర్షించేందుకు డిస్కౌంట్స్ ఇస్తున్న ఎయిర్లైన్ కంపెనీలు..

ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం,ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతోనే
ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్న ప్యాసింజర్లు.

ఢిల్లీ–న్యూయార్క్ రూట్ లో ఎయిర్ఇండియా ధరలు రూ.45 వేల నుంచి మొదలవుతుండగా, ఇండిగో రూ.46వేలకి సర్వీస్ అందిస్తోంది. అమెరికన్ ఎయిర్ లైన్స్ వంటి కంపెనీల టికెట్ రేట్లురూ.67 వేల దగ్గర ఉన్నాయి. తాజాగా ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతో ఈ కంపెనీ బ్రాండ్ నెగెటివ్ ప్రభావం పడింది. బుకింగ్స్ 30–35 శాతం పడిపోయాయి. దీనికి స్పందనగా, ప్యాసింజర్ వాల్యూమ్ను తిరిగి పెంచుకోవడానికి, కీలక అంతర్జాతీయ స్లాట్లను రిటర్న్‌ వేయడానికి ఎయిర్ ఇండియా భారీగా డిస్కౌంట్స్ ఇస్తోంది. ఢిల్లీ- దుబాయ్రూట్ చాలా ఎయిర్లైన్ కంపెనీల టికెట్ రేట్లు రూ.10 వేల దగ్గరలో ఉన్నాయి. ఇతిహాద్, ఎయిర్ అరేబియావంటి కంపెనీలు కూడా తక్కువ రేట్లకే సర్వీస్లు అందిస్తున్నాయి.
ఢిల్లీ–హాంకాంగ్ ఫ్లెట్స్ ఇండిగోలో రూ.14వేల కంటే తక్కువకు లభిస్తున్నాయి.ఎయిర్ ఇండియా ఆఫర్ చేస్తున్నరూ.21వేల టికెట్ రేటు కంటే ఇది చాలా తక్కువ. మిడిల్ ఈస్ట్ కొనసాగుతున్న టెన్షన్ల వల్ల ఇరాన్, చుట్టుపక్కల ఎయిర్ స్పేస్ ను మూసేశారు. దీంతోఎయిర్లైన్స్ సెంట్రల్ ఆసియా, కాస్పియన్సీ, మెడిటరేనియన్ మీదుగా సుదీర్ఘమైన,ఖరీదైన రూట్లను తీసుకోవాల్సి వస్తోంది.ఈ డీటూర్స్ వల్ల ఇంధన ఖర్చులు,ఆపరేషనల్ ఖర్చులు పెరగొచ్చు. కొన్ని విమాన సర్వీస్లు ఆలస్యమవ్వొచ్చు.

8 ఎయిర్ ఇండియా సర్వీస్ లు రద్దు..
మరోవైపు ఎయిర్ ఇండియా 8 విమాన సర్వీస్లను రద్దు చేసింది. ఇందులో 4అంతర్జాతీయ, 4 దేశీయ విమాన సర్వీస్లున్నాయి. కస్టమర్లకు రిఫండ్ ఇస్తామని, ఫ్రీ రీషెడ్యూల్ చేస్తామని కంపెనీ పేర్కొంది. జూన్ 21 నుంచి జులై 15 వరకు 3 విదేశీ మార్గాల్లోని విమాన సర్వీస్లను పూర్తిగా ఆపేశామని, 16
ఇంటర్నేషనల్ రూట్లలో సర్వీస్లను తగ్గిస్తామని తెలిపింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe