ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధంఅంతకంతకూ ముదురుతోంది. ఇరుదేశాలు తగ్గేదేలే అన్నట్లుగా పరస్పర దాడులకు దిగుతున్నాయి. ఇరాన్ న్యూక్లియర్ సైట్లను టార్గెట్ చేస్తూఇజ్రాయెల్ దాడి చేస్తుంటే.. ఇజ్రాయెల్మిలిటరీని లక్ష్యంగా చేసుకుని ఇరాన్దాడులకు దిగుతోంది. ఇందులో నాయకులు, ఆర్మీ అధికారులతో పాటు సామాన్యులు కూడా మృతి
చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉన్నట్లుండి అమెరికా ఇరాన్ పై దాడికి దిగింది. మూడు అణుకేంద్రాలను భారీ బాంబులతో పేల్చేసింది. ఇకనైనా శాంతి ఒప్పందానికి రావాలని ఇరాన్ ను హెచ్చరించారు ట్రంప్.

అమెరికా హెచ్చరికలను, దాడులను ఇరాన్ లెక్క చేసినట్లు కనపడటం లేదు. తమపై దాడికి నిరసనగా ఇజ్రాయెల్ పై మరో సారి భీకర దాడికి దిగింది. మిస్సెళ్లతో విరుచుకుపడింది. ఆదివారం (జూన్ 22)ఒక్కసారిగా మిస్సెళ్లను వదలటంతో ఇజ్రాయెల్ అలర్ట్ అయ్యింది. జెరూసలెంలో భారీ పేలుళ్లు సంభవించినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. హైఫా, టెల్అవివ్ ప్రాంతాలపై రెండు బ్యాచులుగా మొత్తంగా 27 మిసైళ్లను ప్రయోగించింది.
ఇరాన్ నుంచి మిస్సెళ్ల వర్షం కురుస్తుందని ప్రకటించింది. ఇజ్రాయెల్ చుట్టూ సైరన్ ల మోతతో మార్గోగుతోంది.ఇరాన్ మిస్సెల్స్ లాంచ్ చేసిందని. పబ్లిక్ స్టేటస్ లు, లొకేషన్లు షేర్ చేయవద్దని ఇజ్రాయెల్ మిలిటరీ సూచించింది.
అమెరికా దాడి తర్వాత ఇజ్రాయెల్ లో వరుస దాడులకు ఇరాన్ దిగటంతో పరిస్థితి మరింత ఆందోళన కరంగా తయారయ్యింది.
అమెరికా దాడుల తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ పై విరుచుకుపడటం గమనార్హం. ఆదివారం ఉదయం ఇరాన్‌లోని ఫార్గో, నతాంజ్, ఇన్ఫహాన్ అణుస్థావరాలపై దాడి చేసింది అమెరికా. బీ-2స్పిరిట్ అనే భారీ బాంబర్లతో భీకర దాడులు జరిపింది. దాడుల అనంతరం ఇరాన్ లోని మూడు అను స్థావరాలపై బాంబులు వేసినట్లు ఆదివారం (జూన్ 22)ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ కు వ్యతిరేకంగా యుద్ధంలోకి దిగామనిvఅధికారికంగా అనౌన్స్ చేశారు.దాడులు చేశాం.. ఇక శాంతి ఏర్పాటు చేయాల్సి ఉంది.. శాంతి కావాలకంటే ఇరాన్ తగ్గాలని.. లేదంటే మరింత దూకుడుగా వ్యవహరిస్తామని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ట్రంప్ మాటలు లెక్క చేయకుండా ఇరాన్ దాడులకు దిగటం ఆందోళన కలిగించే అంశం.అంతే కాకుండా అమెరికా దాడులకు ప్రతీకారంగా పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు,సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ ప్రకటించింది.అమెరికా ప్రారంభించింది.. మేము అంతం చేస్తామని హెచ్చరించింది. అమెరికా కూడా దాడులను తీవ్రతరం చేస్తామని
హెచ్చరించింది.
ఇక అంతకు ముందే ఇరాన్ పై యుఎస్ దాడి చేస్తే ఎర్రసముద్రంలోని అమెరికా నౌకలను, ఆర్మీని టార్గెట్ చేస్తామని హౌతీ హెచ్చరించింది. మరోవైపు ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా రావద్దని రష్యా హెచ్చరించింది. కానీ అమెరికా దాడితో ఇరాన్ కు మద్దతుగా రష్యా, చైనా రంగంలోకి దిగుతాయా..? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనని ప్రపంచ
దేశాలు భావిస్తున్నాయి.