అంతర్జాతీయ యోగా దినోత్సవంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ,దొడ్ల వెంకటేష్ గౌడ్

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తెలంగాణ బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ముఖ్య అతిధిగా హైద్రాబాద్ కలెక్టర్ శ్రీమతి హరిచందన దాసరి  ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ లోని కేబీఆర్ నేషనల్ పార్క్ లో నిర్వహించిన యోగా దినోత్సవ కార్యక్రమంలో 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు పాల్గొని యోగాసనాలు వేయడం జరిగింది. ఈ సందర్బంగా మంత్రి గారు మరియు కలెక్టర్ గారు మాట్లాడుతూ ఆరోగ్యంతో ఆనందమయ జీవితం గడపడానికి యోగా ఎంతో మేలు చేస్తుందని అన్నారు. పని ఒత్తిడి, ఆందోళనతో సతమతమవుతున్న ప్రస్తుత బిజీ జీవితానికి యోగా ఎంతో అవరమని అన్నారు. సంప్రదాయక జీవితానికి దూరమై మన పనులు కూడా మనం చేసుకోకుండా ఎలక్ట్రిక్ పరికరాల మీద ఆదరపడుతున్న నేటి యాంత్రిక జీవితంలో యోగసనాలు వేయడం అందరికి ఎంతో అవసరమని, యోగా ద్వారా శారీరిక దృఢత్వం, మానసిక ప్రశాంతత లభిస్తుంది కాబట్టి మనమందరం యోగా ను ప్రతినిత్యం ఆచరిస్తూ, దినచర్యలో భాగం చేసుకోవాలని తెలియచేసారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe