బల్కంపేట ఆలయానికి రూ. కోటి విరాళమిచ్చిన నీతా అంబానీ

Telangana: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకుంటారు. తాజాగా ఈ ఆలయానికి ఆమె రూ.కోటి విరాళంగా ఇచ్చారు.ఈ ఏడాది ఏప్రిల్ 23న నీతా అంబానీ దేవస్థానానికి వచ్చినప్పుడు ఆలయ విశిష్టతను ఈవో ఆమెకు వివరించారు. ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. దీంతో ఆమె రూ. కోటి విరాళాన్ని ఆలయఖాతాలో జమ చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe