Gold Rate: అస్సలు తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంత ఉందంటే..

Gold And Silver Price In Hyderabad – Vijayawada: తగ్గేదేలే.. బంగారానికి మళ్లీ రెక్కలు వచ్చేశాయి. ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పెట్టుబడులకు సేఫ్ అయిన బంగారం వైపు ఇన్వెస్టర్లు చూస్తుండటంతోబంగారం ధర లక్ష మార్కు దాటి పరుగులు తీస్తోంది. బంగారం ధరలు ఆల్‌టైమ్ గరిష్టంలో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడి, ముడిచమురు ధరలు పెరగడం వంటి అంశాలు పసిడి ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. వెండి ధరలు కూడా గరిష్ట స్థాయిల్లోనే కొనసాగుతున్నాయి. తాజాగా.. కూడా బంగారం ధరలు పెరిగాయి.. జూన్ 19 2025 గురువారం ఉదయం వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 1,01,080 ఉండగా.. 22 క్యారెట్ల ధర 96,650 లుగా ఉంది. బంగారం రూ. 170 మేర ధర పెరిగింది. వెండి కిలో పై రూ.1000 పెరిగి.. రూ.1,12,000లుగా ఉంది.
నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,080 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.92,650 లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,21,000లుగా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,01,080 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.92,650లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,22,000 లుగా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,01,210, 22 క్యారెట్ల ధర రూ.92,800 లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,12,000లుగా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.1,01,080, 22 క్యారెట్ల ధర రూ.92,650 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,12,000లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,01,080 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.92,650 లుగా ఉంది. వెండి ధర కిలో రూ.1,22,000 లుగా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,01,080, 22 క్యారెట్ల ధర రూ.92,650 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,12,000 లుగా ఉంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe