ఇంగ్లండ్‌లోని ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 20,21 తేదీల్లో జరిగే సదస్సులో పాల్గొననున్న కేటీఆర్
ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్‌లో ‘భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు’ (ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఫర్ డెవలప్‌మెంట్ ఇన్ ఇండియా) అనే ప్రధాన అంశంపై చర్చ జరగనుంది.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకున్న చర్యలు, అభివృద్ధి దిశగా అమలు చేసిన పారిశ్రామిక విధానాలు, ప్రజా సేవలను మెరుగుపరచడంలో సాంకేతిక వినియోగం వంటి అంశాలపై ఆయన ప్రసంగించనున్నారు.
యూకే పర్యటనకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

19
Jun