BB6 TELUGU NEWS CHANNEL :
తెలంగాణలో మూడు రోజుల ( ఆగస్టు28 నుంచి) పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి జిల్లా అతలాకుతలం అయింది.
వాయువ్య బంగాళాఖాతం దాని పరిసరాల్లో ఒడిశా, వెస్ట్ బెంగాల్ తీరాలకు సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. సముద్ర మట్టం నుంచి5.8 కిలోమీటర్ల మధ్యలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది రాగల 24గంటల్లో అల్పపీడనంగా బలపడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు
ఆగ్నేయ దిశలో ఈశాన్య బంగాళాఖాతం వరకు వృత్తాకార పవన ద్రోణి కొనసాగుతుంది.
ఆదిలాబాద్… కొమరం భీమ్,ఆసిఫాబాద్.. మంచిర్యాల… జయశంకర్భూపాలపల్లి… ములుగు… భద్రాద్రికొత్తగూడెం … హనుమకొండ… వరంగల్ ,మహబూబాబాద్ కామారెడ్డి…మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.కామారెడ్డి ..మెదక్ .. నిర్మల్ జిల్లాలో నమోదైన అత్యంత భారీ వర్షాలు ..
కామారెడ్డి లోని అర్కొండా 43.3 cm
నిర్మల్ లోని అక్కాపూర్ 32.3 cm
మెదక్ లోని సర్దాన లో 31.6 cmకామారెడ్డి లో 29.5 cmకామారెడ్డి లోని తాడ్వాయి లో 28నిర్మల్ లోని వడ్యల్ 27.9కామారెడ్డి లోని బిక్నూర్ 27.9మెదక్ లోని నాగపూర్ 27.7కామారెడ్డి లోని పాత రాజంపేట 24.7
నిర్మల్ లోని విశ్వనాధ్ పేట 24, ముజిగి 23
మెదక్ చేగుంట 23 ,సిద్ధిపేట 18 ,కొమరం , బీమ్17 , నిజామాబాదు 17,కరీంనగర్ 16
, ములుగు 15రాజన్న సిరిసిల్ల 13• మంచిర్యాల 11,ఖమ్మం 11 ,జగిత్యాల 10 ,సంగరెడ్డి 10, యాదాద్రి భువనగిరి 10 వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం 16 ప్రాంతాల్లో అత్యంత భారీవర్షాలు నమోదు అయ్యాయి. తెలంగాణలో 43 ప్రాంతాల్లో అతి భారీ వర్ష సూచన.. హైదరాబాద్ లోని తెలీకపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. ఈరోజు
( ఆగస్టు 28) 11 జిల్లాలకు భారీ వర్షం కురుస్తుంది. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.