BB6 TELUGU NEWS 15 Aug 2025 :
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ముజహిద్ పూర్ మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ వరకు చదివిన విద్యార్థి ప్రహ్లాద్ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రభుత్వ కళాశాలలో చదువుకొని వికారాబాద్ జిల్లా అబ్బాయిల విభాగంలో జిల్లా టాపర్ గా ముజాహిద్పూర్ మోడల్ స్కూల్ విద్యార్థి ప్రహ్లాద్ టాపర్ గా నిలిచాడు.ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, గౌరవ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, గౌరవ తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, కుల్కచర్ల మండలం మార్కెట్ కమిటీ చైర్మన్ బి ఎస్ ఆంజనేయులు, గౌరవ PACS చైర్మన్ కనకం మొగులయ్య,కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగారూ.10 వేల నగదు బహుమతిని విద్యార్ధి ప్రహ్లాద్ కు అందించడం జరిగింది.విద్యార్ధి ప్రహ్లాద్ ని ప్రిన్సిపల్ జ్యోతి హెప్సిబా, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు అభినందించారు.
ఇంటర్మీడియట్ లో వికారాబాద్ జిల్లా టాపర్ గా నిలిచిన ప్రహ్లాద్ కు 10వేల నగదు బహుమతి

15
Aug