నగరంలో గణేష్‌ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలి: GHMC కమిషనర్ RV కర్ణన్

BB6 TELUGU NEWS  12 Aug 2025
Ravi kumar : హైదరాబాద్‌,రానున్న  గణేష్ ఉత్సవాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా , శాంతియుత వాతావరణంలో జరిగేలా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సహకారం అందించాలనీ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ కోరారు.
సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 27 వ తేదీన ప్రారంభమై సెప్టెంబర్ 6 వ తేదీన పూర్తి కానున్న  గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కమిషనర్ అధ్యక్షతన  సన్నాహక సమన్వయ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా కమిషనర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ.
గత సంవత్సరం మాదిరి గానే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఘనంగా గణేష్ ఉత్సవాలు జరిగేలా జీహెచ్ఎంసీ, పోలీస్, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది సహకారం అందిస్తుందని తెలిపారు.
ఇప్పటికే నగర పరిధిలో అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపడుతున్నట్లు చెప్పారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe