BB6 TELUGU NEWS 11 Aug 2025 :
మహమ్మదాబాద్ మండల పరిధిలో గల గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకొని వాటిని జిల్లా కేంద్రంలోని ప్రజావాణి కార్యక్రమాన్ని దృష్టికి తీసుకు వెళ్లేందుకు చలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశపల్లి చౌరస్తా నుండి ప్రారంభమై నంచర్ల మీదుగా, గాదిర్యాల గ్రామం గుండా చౌదర్పల్లి, మంగంపేట, ముకర్లబాద్ గ్రామాల మీదుగా మహమ్మదాబాద్ మండల కేంద్రానికి చేరుకొని కాంగ్రెస్ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఆయా గ్రామాల ప్రధాన చౌరస్తాలలో బిజెపి పార్టీ నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా బిజెపి ఓబీసీ మోక్ష ప్రధాన కార్యదర్శి డాక్టర్ వెన్నఈశ్వరప్ప మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రైతుబంధు రాలేదు, రైతు బీమా లేదు, మహిళలకు 2500 రూపాయలు రాలేదు, విద్యార్థినిలకు స్కూటీలు ఇవ్వలేదు అని ఎద్దేవా చేశారు. అయితే ప్రస్తుతం గ్రామాలలో పరిపాలన అంతా కేవలం కేంద్రం నుంచి వచ్చే నిధులతో మాత్రమే నడుస్తుందని గ్రామాలలో సిసి రోడ్లు, డ్రైనేజీలు, ఉచిత రేషన్ బియ్యం, ఇందిరమ్మ ఇండ్లలో కూడా సగం కేంద్రం నిధులె ఉన్నాయన్నారు. అలాగే మండల పరిధిలో జోరుగా పనులు సాగుతున్న జాతీయ రహదారి కోసం 2100 కోట్ల నిధులు కేంద్రం ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్కు పరిపాలన చేతకావడం లేదని ఆరు గ్యారెంటీ ల పేరుతో అమలు చేతగాని 420 హామీలు ఇచ్చారు కానీ వాస్తవానికి వాటిని నెరవేర్చే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలు గ్రహించి వెంటనే దిద్దుబాటు చర్యగా బిజెపి పార్టీ అభ్యర్థులను స్థానిక సంస్థలలో గెలిపించి వారికి గట్టిగా బుద్ధి చెప్పాలి అన్నారు. ఈ *కార్యక్రమంలో* బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ కరణం ప్రహ్లాద్ రావు , రాష్ట్ర నాయకులు ఏవి రాములు గారు, పెంటన్న విజయ్ జిల్లా ఉపాధ్యక్షులు కేశవులు , కమిటీ మెంబర్ కురవ కృష్ణ , మండల అధ్యక్షుడు మూస నర్సింహులు , పరిగి అసెంబ్లీ కన్వీనర్ నరసింహ , బిజెపి సీనియర్ నాయకులు హరికృష్ణ , జాజుల అనిల్ , బందయ్య , మండల అధ్యక్షులు గుండాల వెంకటేష్ , శ్రీనివాస్ , మల్లేష్ గారు, అనసూయ శ్యాంసుందర్ గారు, బిజెపి నాయకులు గాదె మైపాల్ , రాఘవేందర్ రెడ్డి, నరసింహులు , జై వర్ధన్ రెడ్డి , కాశీనాథ్ , బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది
సమస్యల పరిష్కారం కోసమేచలో ప్రజావాణి పాదయాత్ర

11
Aug