బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దూకుడు. 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటు..కంపెనీలపై కేసు నమోదు

బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దూకుడు.. 29 మంది సినీసెలబ్రిటీలతో పాటు కంపెనీలపై కేసు నమోదుబెట్టింగ్ యాప్ కేసులో విచారణను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)మరోసారి ముమ్మరం చేసింది. 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటుకంపెనీలపై కేసు నమోదు చేసింది. హీరో విజయ్ దేవరకొండ, రానా,మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్..

బెట్టింగ్‌ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో ఈడీ దూకుడు చూపింది. ఈ కేసులో 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటు 4 కంపెనీలపై ఈడీ కేసు నమోదు చేసింది. అందులో సినీ నటీనటులతో పాటు యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఉన్నారు. కేసు నమోదు అయిన వారిలో విజయ్ దేవరకొండతో పాటు రానా ,మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్ ,నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, శ్రీముఖి, ప్రణిత, విష్ణు ప్రియ వంటి ప్రముఖులు ఉన్నారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు గతంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడి కేసు విచారణ ప్రారంభించింది. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేసినందుకు గాను వారు పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారికి సంబంధించిన ఐటీ రిటర్న్‌లలో ఈ లెక్కలు లేవని అధికారులు గుర్తించారట. దీంతో మనీ లాండరింగ్‌ కింద కేసు ఈడీ కేసు నమోదు చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe