బాలుర ఉన్నత పాఠశాల వెన్నచేడ్ విద్యార్థుల ఇండస్ట్రియల్ టూర్ విజయవంతం

BB6 TELUGU NEWS CHANNEL
వెన్నచేడ్ పీఎం శ్రీ పాఠశాల కార్యక్రమాలలో భాగంగా బాలుర ఉన్నత పాఠశాల వెన్న చేడ్ విద్యార్థులను ఇండస్ట్రియల్ టూర్ తీసుకెళ్లడం జరిగింది. ముందుగా దివిటీ పల్లి గ్రామ పరిధిలోగల ఐటీ పార్క్ ను, సందర్శించారు. ఐటీ పార్క్ ఇంచార్జీ అయిన మధు చౌదరి మరియు ఆనంద్ కుమార్, ఐటీ పార్క్ ప్రత్యేకత గురించి తెలియచేశారు. తర్వాత పోలేపల్లి ప్రత్యేక ఆర్థికమండలి సెజ్ కి వెళ్లి సుప్రీమ్ ప్లాస్టిక్ కంపెనిని సందర్శించారు. అక్కడ ప్లాస్టిక్ కుర్చీలు పైపులు వాటర్ ట్యాంకర్ల తయారీ ప్రక్రియను తెలుసుకోవడం జరిగింది. ఈ టూర్ కు విద్యార్థులతో పాటు ప్రధానోపాధ్యాయులు శ్రీ రవి బాబు గారు, మరియు ఉపాధ్యాయులు ముకుంద రెడ్డి ,హనుమంతు, కొండయ్య, పుష్పలత, చంద్రమౌళి వెళ్లడం జరిగింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe