BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం దేశాయపల్లి గేట్ చౌరస్తాలో ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట్ మండలం వేముల గ్రామంలో దళిత సామాజిక వర్గానికి చెందిన మాల ప్రవళిక అనే అమ్మాయిని ఈ నెల 17 తారీకు రోజు రాత్రి సమయంలో గ్రామంలో ఉన్నటువంటి రైతు వేదిక దగ్గర అమ్మాయిని రేప్ చేసి చంపడం జరిగింది. అత్యాచారంకు పాల్పడి చంపిన నలుగురు నిందితులను బహిరంగ ఎన్కౌంటర్ చేయాలని అదేవిధంగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అగ్రకులాలకు ఒక న్యాయం దళితులకు ఒక న్యాయమా అని పలువురు నాయకులు ప్రశ్నించారు.
సమాజంలో దళిత మహిళలపై అత్యాచారాలు చేసి చంపిన కూడా ఇప్పటికీ పది రోజులు గడుస్తున్నా స్పందించుకోవడం ఎంతవరకు సమంజసమని డిమాండ్ చేస్తున్నారు. నిందితులను ఎన్కౌంటర్ చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చాలామంది నాయకులు హెచ్చరించారు.
కార్యక్రమంలో గండీడ్ మండల ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కప్లాపూర్ ఆశన్న, ఉమ్మడి గండీడ్ మండల మాజీ జెడ్పీటీసీ జంగాళ్ల వెంకటయ్య,పరిగి నియోజకవర్గ పరిరక్షణ వేదిక అధ్యక్షులు ఘనపూర్ రాఘవేందర్ గౌడ్, మహమ్మదాబాద్ మాజీ ఎంపిటిసి వేణు గౌడ్,రంగారెడ్డి పల్లి మాజీ ఎంపిటిసి కిష్టయ్య, జూలపల్లి మాజీ సర్పంచ్ ఎం.రామచంద్రయ్య, ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, వ్యవసాయ వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు బద్దుల రాజు,గండీడ్ మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు హస్నబాద్ వెంకటయ్య, స్వేరోస్ జిల్లా అధ్యక్షులు జంగాళ్ల విజయ్ కుమార్,ఎమ్మార్పీఎస్ గండీడ్ మండల అధ్యక్షులు కొండాపూర్ దస్తయ్య, నంచర్ల ఉమ్మడి మండల ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షులు మాలే వెంకటయ్య, జోగు అంజిలయ్య, గాదిర్యాల్ చంద్రయ్య,రుసుంపల్లి గోసాయి వెంకటయ్య, బొక్కి కిష్టయ్య, మాలే దాసు, వార్ల కృష్ణయ్య,పోతగల్ల మైబు, నల్లోల్ల శ్రీనివాస్,వెంకటయ్య, రాములు, సoటె శ్రీనివాస్, మంగంపేట కృష్ణయ్య, నంచర్ల జోగు శ్రీనివాస్, మణెమ్మ, మల్లమ్మ, వెంకటమ్మ, అంజమ్మ, తదితరులు పాల్గొన్నారు.
ప్రవళికను అత్యాచారం చేసి చంపిన నిందితులను బహిరంగ ఎన్కౌంటర్ చేయాలి
26
Dec