దక్షిణాదిలో మద్యం వినియోగంలో తెలంగాణ అగ్రస్థానం

BB6 TELUGU NEWS CHANNEL
దక్షిణ భారత రాష్ట్రాల్లో మద్యం వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. తాజా గణాంకాల ప్రకారం తెలంగాణలో ఏడాదికి తలసరి ఆల్కహాల్ వినియోగం 4.44 లీటర్లుగా నమోదైంది. ఇది దక్షిణాదిలోనే అత్యధికం కావడం గమనార్హం.
తెలంగాణ తర్వాతి స్థానాల్లో
కర్ణాటక – 4.25 లీటర్లు
తమిళనాడు – 3.38 లీటర్లు
ఆంధ్రప్రదేశ్ – 2.71 లీటర్లు
కేరళ – 2.53 లీటర్లు గా తలసరి మద్యం వినియోగం నమోదైంది. ఖర్చులోనూ తెలంగాణ ముందంజ
మద్యం పై తలసరి ఖర్చు విషయంలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. తెలంగాణలో ఒక వ్యక్తి ఏడాదికి సగటున రూ.11,351 మద్యంపై ఖర్చు చేస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇది రూ.6,399గా ఉంది. అంటే ఏపీతో పోలిస్తే తెలంగాణలో మద్యం పై ఖర్చు దాదాపు రెండింతలు ఎక్కువగా ఉంది.సామాజిక–ఆర్థిక ప్రభావాలపై చర్చ
ఈ గణాంకాలు తెలంగాణలో మద్యం వినియోగం సామాజిక, ఆర్థిక అంశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయనే చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ వ్యయం, ఆరోగ్యం, ఉత్పాదకతపై మద్యం వినియోగం ప్రభావం చూపుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe