ఘనంగా శ్రీనివాసన్ రామానుజన్ 138 వ జయంతి

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్రవేత్త రామానుజన్ జయంతి ఘనంగా నిర్వహించారు. రామానుజన్ జయంతి సందర్భంగా మండల విద్యాధికారి రుద్రారం జనార్ధన్ సార్ మాట్లాడుతూ శ్రీనివాసన్ రామానుజన్ అయ్యంగార్ 1887 సంవత్సరం  డిసెంబర్ 22తారీకు రోజున తమిళనాడు రాష్ట్రంలోను ఈరోడ్ పట్టణంలో శ్రీనివాసన్ అయ్యంగార్ కోమలటమ్మల్ దంపతులకు జన్మించాడు. బ్రిటిష్ పరిపాలన కాలంలో భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త 20 శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు గణిత విశ్లేషణ సంఖ్యాశాస్త్రం అనంత శ్రేణులు అవిరామ భిన్నాలు లాంటి గణిత విభాగానికి విశేషమైన కృషి చేశాడు రామానుజన్ కనుక్కున్న సూత్రాలు అపూర్వమైనవి. అప్పటిదాకా ఎవరు పరిచయం చేయనివి దానికి తోడు ఇతను సమర్పించిన విధానం కూడా విభిన్నమైనది. ఇతనిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన హార్డీ అసలు తను తను గణిత శాస్త్రానికి చేసిన అత్యుత్తమసేవ రామానుజన్ ని కనుగొనడమే అని వ్యాఖ్యానించడం విశేషం. కార్యక్రమంలో మండల విద్యాధికారి రుద్రారం జనార్ధన్ ఉపాధ్యాయులు గంట శ్రీనివాస్, మోహన్ రెడ్డి,కృష్ణారెడ్డి, రమణ,లక్ష్మణ్, బోరు కృష్ణయ్య, ఎ. కృష్ణయ్య, రవీందర్, కొండయ్య, కళ్యాణి, మమత, వేదవతి ,శ్యామల, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe