BB6 TELUGU NEWS CHANNEL
Telangana Panchayat Elections 2025 : ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం.
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మూడు దశ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ దశంలో 182 మండలాల్లోని 4,159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 394 సర్పంచి స్థానాలు, 7,908 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అందువల్ల 3,752 గ్రామ పంచాయతీలకూ, 28,410 వార్డులకూ పోలింగ్ జరగనుంది. ఈ దశలో 3,752 సర్పంచి స్థానాలకు 12,652 మంది అభ్యర్థులు, మొత్తం 36,425 వార్డుల్లో 28,410 వార్డులకు (ఏకగ్రీవాలు తప్ప) 75,725 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 11 సర్పంచి స్థానాలకు నామినేషన్లు రాలేదు, రెండు పంచాయతీల్లో కోర్టు కేసులు లేదా ఇతర కారణాల వల్ల ఎన్నికలు నిలిపివేశారు. ఈ విడతలో సుమారు 53 లక్షల మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 26 లక్షలు, మహిళలు 27 లక్షలు, ఇతరులు కొద్దిమంది ఉన్నారు. వీరంతా తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
కాసేపట్లో మూడో దశ పోలింగ్.. సంబరాలకు రెడీ అవుతున్న కాంగ్రెస్!
17
Dec