BB6 TELUGU NEWS CHANNEL
రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7గంటల నుంచి మొదలైంది. 193 మండలాల్లోని 3 వేల 911 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం 38 వేల 350 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆయా కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని వసతులు
కల్పించారు.
కొన్నింటిని మోడల్ పోలింగ్ స్టేషన్లుగా
తీర్చిదిద్దారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్
ఉంటుంది. 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియను చేపట్టి.. విజేతలను ప్రకటించనున్నారు. అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహించనున్నారు.415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం..రెండో విడతలో మొత్తం 4,333 పంచాయతీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వగా.. 5 పంచాయతీలు,108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 415 పంచాయతీల్లో సర్పంచ్, 8,307 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల 2 పంచాయతీలు, 18వార్డుల్లో ఎన్నికలు నిలిచిపోయాయి.
దీంతో మిగిలిన 3,911 సర్పంచ్, 29,917వార్డు మెంబర్ స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్పదవుల కోసం 12,782 మంది,వార్డు మెంబర్ల కోసం 71,071 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 38,350 పోలింగ్ కేంద్రాలు సెకండ్ ఫేజ్ ఎన్నికల కోసం 38,350 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.పోలింగ్ కు మూడ్రోజుల ముందు నుంచే బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారు. అందని వారికి పోలింగ్ రోజు అక్కడే అందించనున్నారు. అభ్యర్థులు లేదా పార్టీలు ఇచ్చే స్లిప్పులు సాదా తెల్లకాగితంపై మాత్రమే ఉండాలి. వాటిపై ఎలాంటి గుర్తులు, అభ్యర్థి ఫొటోలు, పేర్లు, పార్టీ పేర్లు ఉండొద్దని ఎస్ఈసీ స్పష్టం చేసింది.
తెలంగాణ రెండోవిడత పంచాయతీ ఎన్నికలు..ముగిసిన పోలింగ్.. రికార్డ్ శాతం పోలింగ్ నమోదు
14
Dec