మక్తల్‌ను గత పాలకులు నిర్లక్ష్యం చేశారు-ప్రజాపాలన విజయోత్సవాల ప్రారంభంలో సీఎం రేవంత్‌ రెడ్డి

BB6 TELUGU NEWS CHANNEL
మక్తల్‌ నియోజకవర్గంలో ప్రజాపాలన విజయోత్సవాలను ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి, గత పాలకులు ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుందని, మోసగిస్తే పాతాళంలోకి తొక్కుతుందంటూ ప్రజల నిజాయితీ, నిబద్ధతను గుర్తుచేశారు.

గత ప్రభుత్వాలు ఈ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయలేదని, ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేయడంలో విఫలమయ్యాయని పేర్కొన్నారు.

నారాయణపేట్–కొడంగల్‌ ఎత్తిపోతల పథకం విషయంలో పదేళ్లుగా ఎవరూ మన గోడు వినలేదని అన్నారు. ప్రాజెక్టుకు భూమి ఇచ్చిన రైతులకు రూ.20 లక్షల పరిహారం అందిస్తున్నామని, రైతులు అడిగినంత పరిహారం ఇచ్చి ప్రాజెక్టును పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

“దండు కట్టండి, గుంపు కట్టండి, దగ్గరుండి పని చేయించుకోండి. ఎవరైనా లంచం అడిగితే వీపు విమానం మోత మోగిచండి” అని అవినీతిపైనా సీఎం రేవంత్‌ బహిరంగ హెచ్చరిక జారీ చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe