PM Kisan Samman Nidhi: రైతులకు గుడ్ న్యూస్.. పీఎంకిసాన్ 21వ విడత ఎప్పుడంటే?

PM Kisan Samman Nidhi: అన్నదాతలకు పెట్టుబడి సాయమందించే ఆశయంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం-కిసాన్ (PM Kisan) నిధులు విడుదల కానున్నాయి.

BB6 TELUGU NEWS CHANNEL
PM Kisan Samman Nidhi : అన్నదాతలకు పెట్టుబడి సాయమందించే ఆశయంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం- కిసాన్ (PM Kisan) నిధులు విడుదల కానున్నాయి. ఈ పథకం కింద 21వ విడత(PM Kisan 21th installment) నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 19న విడుదల చేయనున్నారు.ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ పథకం 2019 ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. పీఎంకిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతోంది. ఇప్పటి వరకు 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. భూమి వివరాలు PM-KISAN పోర్టల్లో నమోదై ఉండి, బ్యాంకు ఖాతా ఆధార్ లింక్ అయి ఉన్న రైతులకే పథకం ప్రయోజనాలు అందుతున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe