శుభవార్త : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లోరూ. 202 కోట్లు.

BB6 TELUGU NEWS CHANNEL
రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నాటికి 37,400 ఇందిరమ్మఇండ్లకు స్లాబులు పడ్డాయని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ తెలిపారు.ఈ వారంలో వివిధ స్టేజ్లలో ఇండ్లు నిర్మించుకున్న 18,247 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.202.93 కోట్ల బిల్లులు జమచేశామని ఆయన పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రతీవారం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ వారంలో 4,615 మంది లబ్ధిదారులు బేస్ మెంట్ లెవల్ వరకు, 8,517 మంది రూఫ్ లెవల్ (గోడలు పూర్తి) వరకు నిర్మాణాలు చేసుకోగా.. 5,115 మంది స్లాబ్ వేశారని ఆయన తెలిపారు. వారికి వారి బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమచేసినట్టు ఎండీ గౌతమ్ మంగళవారం ఓప్రకటనలో తెలిపారు.
మొత్తం 2,900 కోట్ల బిల్లుల చెల్లింపు ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు మొత్తంరూ.2,900.35 కోట్ల బిల్లులు విడుదల చేసినట్టు హౌసింగ్ ఎండీ గౌతమ్తెలిపారు. వీటిలో బేస్ మెంట్ లెవల్
(బీఎల్) దాటిన ఇండ్లకు రూ.1,610.79కోట్లు, రూఫ్ లెవల్ (ఆర్ ఎల్) వరకు ఇండ్లు నిర్మించుకున్న వారికి రూ.716.91కోట్లు, రూఫ్ క్యాస్టెడ్ (శ్లాబ్ పూర్తి – ఆర్సీ)- అయిన ఇండ్లకు రూ.572.65 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe