BB6 TELUGU NEWS CHANNEL
మన్నెగూడ హైదరాబాద్ రోడ్ విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ..మంగళవారం తాండూరు పట్టణంలో సకల జనాలతో కలిసి నిరసనలో పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ..2023 ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ ప్రభుత్వం రోడ్డు విస్తరణకు అవసరమైన నిధులను మంజూరు చేసి నప్పటికీ,ఎన్నికల అనంతరం కోర్టులో ఉన్న కేసులపై స్పందించ కుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేసిందని,ఆయన విమ ర్శించారు.ప్రజల ప్రాణ భద్రతను పరిగణనలోకి తీసుకొని, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం చర్యలు తీసుకొని మళ్లీ ఎలాంటి ప్రమాదాలు జరగక ముందే రోడ్ విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని,పైలెట్ రోహిత్ రెడ్డి డిమాండ్ చేశారు.
తాండూరులో నిరసన మన్నెగూడ–హైదరాబాద్ రోడ్ విస్తరణకు డిమాండ్..!!
04
Nov