కరీంనగర్ జిల్లాలో మరో ఘోరం ట్రాక్టర్ ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

BB6 TELUGU NEWS CHANNEL
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట బ్రిడ్జ్ దగ్గర కూడా మంగళవారం ఉదయం బస్సు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 15మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వడ్ల లోడ్ ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది.పలువురికి గాయాలయ్యాయి. 108 వాహనంలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మెట్ పల్లి డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వస్తుండగా ఘటన జరిగింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe