మహేశ్ బాబు ఫౌండేషన్ మైల్ స్టోన్ : 5 వేలమందికి హార్ట్ ఆపరేషన్లు.చిన్నారుల ప్రాణాలకు రక్ష

BB6 TELUGU NEWS CHANNEL
Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు కేవలం సినిమాల్లోనే కాదు.. సామాజిక సేవలోనూ రియల్ హీరోనే అనిపించుకుంటున్నారు. ఆయన కొడుకు గౌతమ్ పుట్టినప్పుడు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. గౌతమ్ కు హార్ట్ లో చిన్న ప్రాబ్లమ్ రావడంతో చాలా ఇబ్బంది పడ్డాడంట. తన కొడుకులాగా ఇంకెవరూ ఇలాంటి సమస్యలతో బాధపడొద్దనే ఉద్దేశంతో మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా వేల మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు చేయిస్తున్నాడు సూపర్ స్టార్.తాజాగా 5వేల మందికి హార్ట్ ఆపరేషన్లు పూర్తి అయ్యాయి. ఈవిషయాన్ని ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. మహేశ్ బాబు వేల మంది చిన్నారుల ప్రాణాలను కాపాడుతున్నాడంటూ ప్రశంసిస్తున్నారు. చాలా హాస్పిటల్స్ తో మహేశ్ బాబు ఫౌండేషన్ లింకప్ అయింది. చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ సదరు హాస్పిటల్స్ కు మహేశ్ బాబు ఫౌండేషన్ బిల్లులు కడుతోంది.నిరుపేద కుటుంబాల తమ పిల్లలను కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉంటే.. వారికి మహేశ్ బాబు అండగా ఉంటున్నాడు. ఈ సాయం ఇలాగే కొనసాగుతుందని గతంలోనే మహేశ్ బాబు ప్రకటించారు. ఇప్పుడు మహేశ్ రాజమౌళతో భారీ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీ షూటింగ్ ప్రస్తుతం స్పీడ్ గా జరుగుతుంది. ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకున్నారు మూవీటీమ్. త్వరలోనే ఫారిన్ షెడ్యూల్ ఉంటుందని తెలుస్తోంది.నవంబర్ లో ఈ సినిమా నుంచి భారీ అప్డేట్ రాబోతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe