దీపావళి అంటే 5 రోజుల పండుగ.. టపాసులు కాల్చే ఒక్కరోజు వేడుక కాదు.. ఏ రోజు ఏంచేయాలో తెలుసుకుందాం..!

BB6 TELUGU NEWS CHANNEL
దీపావళి పండుగ అంటేనే దీపోత్సవం….చిన్న.. పెద్దా తేడా లేకుండా హిందువులు ఉత్సాహంగా జరుపుకునే పండుగ. ప్రతిఇల్లు, ప్రతి వీధి, ప్రతి దేవాలయం దీపాలతో కళకళలాడే రోజు. ఇది నిజానికి 5 రోజుల పండుగ. ఈ దీపావళి పండుగ ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజు (ఆక్టోబర్ 18) న ప్రారంభమై కార్తీక శుద్ధవిదియ రోజుతో ( అక్టోబర్ 22) ముగుస్తుంది. ఈ 5 రోజులు పండుగ జరుపుకుంటేనే దీపావళి పండుగను పూర్తిగా జరుపుకున్నట్టు లెక్క.. అసలు ఐదు రోజులు ఈ పండుగను ఎందుకని జరుపుకోవాలి.. పండితులు తెలిపిన ప్రకారం .. దీపావళి ఐదు రోజుల పండుగ ప్రాముఖ్యత .. విశిష్టత గురించి తెలుసుకుందాం…..

దీపావళి పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. ఆశ్వయుజ మాసంలో ధన త్రయోదశి నుంచి భాయ్ పూజ వరకు దీపావళి వేడుకలు చేసుకుంటారు. ఐదు రోజుల పాటు సాగే ఈ పండుగ ఈఏడాది అక్టోబర్ 18 న ధన త్రయోదశి (ధన్హేరాస్)తో ప్రారంభమై అక్టోబర్ 22 నభాయ్ పూజతో ముగుస్తుంది.

Day 1 …అక్టోబర్ 18 ….. ధన త్రయోదశి(ధన్హేరాస్): ఈ రోజున లక్ష్మీదేవి పుట్టినరోజు. .. దేవ దానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మథించే సమయంలో శ్రీమహాలక్ష్మి జన్మించింది. ఆమెను భార్యగా స్వీకరించిన విష్ణుమూర్తి.. సకల సంపదలకు.. ఐశ్వర్యానికి అధిదేవతగా ప్రకటిస్తాడు. అందుకే ఈ రోజున (అక్టోబర్ 18 ) బంగారం కొంటారు. ఈరోజును ధన త్రయోదశి అని పిలుస్తారు..శుభ సమయంలో కొత్త వస్తువులు,బంగారం, వెండి, వాహనాలు, ఆభరణాలు బంగారం, వెండి, వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది లక్ష్మీదేవికృపగా భావిస్తారు.

Day 2…. అక్టోబర్ 19.. నరక చతుర్దశి ..ఛోటీ దీపావళి: ధన త్రయోదశి తర్వాత,ఛోటీ దీపావళిని జరుపుకుంటారు. దీన్నేనరక చతుర్ధశిగా పిలుస్తారు. ఈ సంవత్సరం (2025) నరక చతుర్దశి అక్టోబర్ 19న మధ్యాహ్నం 1:51 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 20న మధ్యాహ్నం 3:44 గంటలకు ముగుస్తుంది. నరకాసురుడిని హనుమంతుడి సహాయంతో శ్రీకృష్ణుడు సంహరించిన సందర్భంగా ఈ పండుగ జరుపుతారు. ఈరోజు ప్రత్యేకంగా హనుమంతుడిని పూజిస్తారు. ఆ రోజు ప్రతి ఒక్కరూ తలస్నానం ఆచరించి కొత్త బట్టలు ధరించి లక్ష్మీదేవిని పూజించాలి. నీటిలో గంగాదేవీ,నువ్వుల నూనెలో లక్ష్మీదేవి కొలువై ఉంటారు. అందుకే నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయాలి. లోకకంటకుడైన నరకాసుర సంహారం జరిగిన రోజు కాబట్టి ఇళ్లనూ, వాకిళ్లనూ అలంకరించి పూజలు చేయాలని పురాణాలు చెబుతున్నాయి.

Day 3 … అక్టోబర్ 20 … దీపావళి అమావాస్య : ఈ ఏడాది (2025)మహాలక్ష్మి పూజ ఆశ్వయుజ అమావాస్య రోజైన అక్టోబర్ 20న నిర్వహిస్తారు.ఆశ్వయుజమాసం అమావాస్య రాత్రి లక్ష్మీదేవిని పూజించడం ద్వారా, శుభం,ఐశ్వర్యం కరువు లేకుండా ఉంటుందని నమ్ముతారు. మహాలక్ష్మి పూజ అనంతరం బాణాసంచా కాల్చడం, మిఠాయిలు పంచుకోవడం ఆనవాయితీ. చాలా మంది దీపావళి రోజున కేదారేశ్వర స్వామి వ్రతం ఆచరించే సంప్రదాయం కూడా ఉంది.
త్రేతాయుగంలో శ్రీరాముడు సీతతో కలిసి అయోధ్యకు ప్రయాణం చేసిన రోజు దీపావళి. .. ద్వాపరయుగంలో పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని వచ్చిన రోజు దీపావళిగా మన పురాణాలు పేర్కొంటున్నాయి.లక్ష్మీపూజ తర్వాత కొత్త దస్త్రాలూ, ఖాతాపుస్తకాలూ తెరవడం ఆచారం. సాయంత్రం ఏ ఇల్లు ముగ్గులు పెట్టి దీపాలతో అలంకరించి ఉంటుందో.. ఆ ఇంటసిరులనిచ్చే శ్రీ మహాలక్ష్మీ దేవి అడుగు పెడుతుందని భక్తుల నమ్ముతుంటారు.దీపావళి అమావాస్య రోజున లక్ష్మీదేవి ఆరాధన చేసేవారికి సకల సంపదలు సిద్ధిస్తాయని శాస్త్ర వచనం.

Day 4 … అక్టోబర్ 21 … బలి పాడ్యమి గోవర్ధన పూజ: శ్రీకృష్ణుడు గోవర్ధన్పర్వతాన్ని వేలితో ఎత్తిన కథతో అనుసంధానించిన రోజున గోవర్ధన్ పూజచేస్తారు. దీనిని ప్రాంతాల్లో అన్న కూట్పండుగగా కూడా జరుపుకుంటారు. దీపావళి మర్నాడు బలిపాడ్యమి… ( కార్తీకశుద్ధ పాడ్యమి) చతుర్దశి నాడు విష్ణుమూర్తి పాతాళానికి అణిచేసిన బలిచక్రవర్తి మళ్లీ భూమ్మీదకి తిరిగివచ్చిన రోజు ఇదేనని చెబుతారు. బలికి పూజలు చేస్తారు. మహారాష్ట్ర వాసులు ఈ రోజును నవదివస్ గా భావిస్తారు. గుజరాతీయులకు ఈ రోజున (2025 అక్టోబర్ 21) ఉగాది పండుగను జరుపుకుంటారు.

Day 5…. అక్టోబర్ 22… భాయ్ పూజ :గోవర్ధన పూజ జరిగిన మరుసటి రోజు భాయ్ దూజ్ జరుపుకుంటారు. ఈరోజున సోదరులు తమ సోదరీమణులకు బహుమతులు ఇస్తారు. మగవారు అక్కాచెల్లెళ్ల చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగి పోతాయి.దీనికి సంబంధించి అద్భుతమైన కథ ప్రాచుర్యంలో ఉంది. యముడు, అతడి సోదరియమి (యమున). ఈమె తన సోదరుణ్ని ఎంతో అభిమానించేది. నిత్యమూ అతని మిత్రులతో సహా వచ్చి తన ఇంట్లో విందుచేసి పొమ్మని ఎన్నిసార్లు కోరినా ఏదో ఒకపనితో క్షణం తీరికలేక వెళ్లలేక పోయాడు. ఈ పరిస్థితిలో యమున కార్తీక శుక్లవిదియనాడు తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తూ వాగ్దానం తీసుకుంటుంది. దానికి యముడు నన్నెవరూ ఇంటికిపిలవరు. అయినా నా తోబుట్టువైన ఆడపడుచు స్వయంగా, సాదరంగా ఆహ్వానించింది. కనుక వెళ్లితీరాలి అని నిర్ణయించుకుని వెళ్లాడు. అలా వచ్చిన సోదరుణ్ని చూసి సంతోషించి, అతనికి స్నానం చేయించి, తిలకం దిద్ది, స్వయంగా చేసిన పదార్థాలను ప్రేమతో కొసరి కొసరి వడ్డించింది. సంతోషాం తరంగుడైన యముడు ఆమెకు వరం ఇవ్వదలిచి కోరుకోమన్నాడు. ఏటా ఆ విధంగానే వచ్చితన ఇంట విందు స్వీకరించమని కోరింది యమున. సోదరీ, సోదరుల మధ్య అప్యాయతకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తోంది..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe