BB6 TELUGU NEWS CHANNEL
మంచిర్యాల కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి వివిధ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన కార్మిక,మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి,పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.
జిల్లా లో యూరియా కొరత,అభివృద్ధి పనుల పై సమీక్ష.
యూరియా కొరత సృష్టించే వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ.
ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్న వారి పై చర్యలు తీసుకోండి.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనే వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి.
డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం ఎలా కొనసాగుతుంది క్వాలిటీ తో కడుతున్నారా లేదా అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇటీవల కురిసిన వర్షాలతో ఎంత పంట నష్టం జరిగింది..పంట నష్ట పరిహారం బాధితులకు అందించారా లేదా అడిగి తెలుసుకున్నారు.
గ్రామాల్లో రోడ్లు,డ్రైనేజీ నిర్మాణ పనులు స్టేటస్ తెలుసుకున్నారు.
