తహసీల్దార్ కార్యాలయంలో నూ తనిఖీలుvనిర్వహిస్తున్న బృందాలు
ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ శాఖలో కలకలం
BB6 TELUGU NEWS CHANNEL: వరంగల్ జిల్లా ఖిలావరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావు ఇళ్లపై ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. హన్మకొండలోని చైతన్యపురి, ఆయన స్వస్థలం ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ బృందాలు దాడులు నిర్వహించాయి. శుక్రవారం ఉదయం ఈ దాడులు మొదలు కాగా.. ఖిలా వరంగల్ మండల తహసీల్దార్ కార్యాలయంలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. కార్యాలయంలోని సిబ్బందిని విచారించడంతో పాటు రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న బండి నాగేశ్వర్రావుపై ఏసీబీ దాడులు నిర్వహించడం రెవెన్యూ శాఖలో కలకలం రేపుతోంది.ఖిలావరంగల్ తహసీల్దార్ పనిచేస్తున్న బండినాగేశ్వర్రావు గతంలో హసన్పర్తి, కాజీపేట తహసీల్దార్గాను పనిచేశారు. ఏసీబీ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.