మేడిపల్లి హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..

BB6 TELUGU NEWS CHANNEL
మర్డర్ చేసేందుకు ముందుగానే హాక్సా బ్లేడ్ కొనుగోలు చేసిన మహేందర్ రెడ్డి.. భార్యను గొంతునులిమి చంపేసి ఫుల్ గా మద్యం సేవించిన మహేందర్.. హాక్సా బ్లేడ్‌తో శరీర భాగాలను కట్ చేసిన మహేందర్ రెడ్డి.. చేతులు ఒక మూటలో, కాళ్లు, తలను మరో మూటలో కట్టి పర్వతపూర్ మూసీలో పడేసిన మహేందర్.. మర్డర్ విషయాన్ని తన బావకు ఫోన్ చేసి చెప్పిన మహేందర్ రెడ్డి.. బావ సూచన మేరకు పోలీసులకు లొంగిపోయిన మహేందర్ రెడ్డి..

మేడిపల్లి హత్యకేసులో సంచలన విషయాలు. మొదటిసారి భార్య గర్భం తీయించిన భర్త మహేందర్‌రెడ్డి. ఓ కాల్‌ సెంటర్‌లో పనిచేస్తోన్న భార్య స్వాతి. మహేందర్‌రెడ్డి, స్వాతి ప్రేమ వివాహం చేసుకున్నారు. మహేందర్‌రెడ్డి క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో వికారాబాద్‌లో 498A కేసు కూడా నమోదైంది. ఈ నెల 22న కూడా గొడవపడ్డారు. స్వాతి గర్భవతి, మెడికల్‌ చెకప్‌కి తీసుకెళ్లమని అడిగింది. ఈ విషయంలోనే మొదలై గొడవ పెద్దగా అయ్యింది. స్వాతిని హత్య చేయాలని ప్లాన్‌ చేశాడు. బోడుప్పల్‌లో ఒక హాక్సాబ్లేడ్ కొన్నాడు. బాడీని ఒక్కసారి తరలించడం వీలుకాక ముక్కలుగా చేశాడు. తల, కాళ్లు, చేతులు వేర్వేరు కవర్లలో చుట్టి శరీర భాగాలను పడేశాడు. మూడుసార్లు మూసీకి వెళ్లి వచ్చిన తర్వాత చెల్లికి కాల్‌ చేశాడు. -డీసీపీ పద్మజ

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe