BB6 TELUGU NEWS CHANNEL : ఏపీ మెగా డీఎస్సీ (AP Mega DSC2025) పరీక్షలు రాసిన అభ్యర్థులకు విద్యాశాఖ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. స్పోర్ట్స్ కోటామెరిట్ జాబితా పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 22 నుంచి మెరిట్ లిస్ట్ లు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి వెల్లడించారు. ఈ మెరిట్ జాబితాను (ap dsc merit list2025) డీఎస్సీ అధికారిక విద్యాశాఖ అధికారి వెబ్సైట్లలోనూ ఉంచనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లు
(ap dscmerit list district wise)
నుంచి మాత్రమే సమాచారంపొందాలని సూచించారు. వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా’జోన్ ఆఫ్ కన్సిడరేషన్’లోకి వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందించనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందన్న ఆయన..అర్హులైన అభ్యర్థులను పారదర్శకంగా నియమించడమే ప్రభుత్వం దృఢ సంకల్పమని స్పష్టం చేశారు.
ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి.. ముందే అప్లోడ్ చేయాలి!
కాల్ లెటర్ అందిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లుతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధ్రువీకరణ| పత్రం, గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు, ఐదు పాస్ పోర్టు సైజు ఫొటోలతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని కన్వీనర్ ఓ ప్రకటనలో సూచించారు. వెరిఫికేషన్‌కు హాజరు కావడానికి ముందే అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను వెబ్సైట్లో అప్లోడ్చేయడం తప్పని సరన్నారు. వెరిఫికేషన్ సమయంలో సమర్పించాల్సిన సర్టిఫికెట్ల వివరాలతో కూడిన చెక్లిస్ట్న డీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాకపోయినా, సరైన సర్టిఫికెట్లు సమర్పించక పోయినా,తగిన విద్యార్హతలు లేనట్లుగా రుజువైనా మెరిట్ లిస్టులో తరువాత ఉన్న అభ్యర్థులకు అవకాశం ఇవ్వనున్నట్లుస్పష్టం చేశారు.
టీచర్ జాబ్ ఇప్పిస్తామంటూ దళారులు చెప్పే మాటలు,సోషల్ మీడియా వేదికగా అసత్య వదంతులను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. దుష్ప్రచారం ద్వారా అభ్యర్థుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. ఇలాంటి దుష్ప్రచారాలను నమ్మి అభ్యర్థులు మోసపోవద్దని, వదంతులు సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కన్వీనర్హెచ్చరించారు. అందువల్ల అభ్యర్థులు కేవలం అధికారిక వెబ్సైట్లో ఉన్న ప్రకటనలు, నోటిఫికేషన్లు, ఫలితాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలన్నారు. వ్యక్తిగత స్కోర్లు, మెరిట్ లిస్ట్, (ap dsc results 2025) ఎంపిక జాబితాలు, నియామక ఉత్తర్వులు మెగా డీఎస్సీవెబ్సైట్, క్యాండిడేట్ లాగిన్లలో, ప్రభుత్వం విడుదల చేసే ప్రతికా ప్రకటనల ద్వారానే తాము తెలియజేస్తామన్నారు.
టీచర్ జాబ్ ఇప్పిస్తామంటూ దళారులు చెప్పే మాటలు, సోషల్ మీడియా వేదికగా అసత్య వదంతులను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. దుష్ప్రచారం ద్వారా అభ్యర్థుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. ఇలాంటి దుష్ప్రచారాలను నమ్మి అభ్యర్థులు మోసపోవద్దని, వదంతులు సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కన్వేయర్ హెచ్చరించారు. అందువల్ల అభ్యర్థులు కేవలం అధికారిక వెబ్సైట్లో ఉన్న ప్రకటనలు, నోటిఫికేషన్లు, ఫలితాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలన్నారు. వ్యక్తిగత స్కోర్లు, మెరిట్ లిస్ట్, (ap dsc results 2025) ఎంపిక జాబితాలు, నియామక ఉత్తర్వులు మెగా డీఎస్సీ వెబ్సైట్, క్యాండిడేట్ లాగిన్లలో, ప్రభుత్వం విడుదలచేసే ప్రతికా ప్రకటనల ద్వారానే తాము తెలియజేస్తామన్నారు.
AP Mega DSC: మెగా డీఎస్సీ మెరిట్ జాబితాపైకీలక అప్డేట్.. అభ్యర్థులకు సూచనలివిగో!

21
Aug