గణపతి మండపాలు ఏర్పాటు చేసే వారికి అలర్ట్..ఆన్లైన్లో ఈ అనుమతులు తీసుకోవాల్సిందే!

BB6 TELUGU NEWS CHANNEL
గణపతి ఉత్సవాల సందడి మొదలైంది.
తెలంగాణ వ్యాప్తంగా వినాయక చవితి కోసం ఇప్పటికే మండపాల నిర్మాణం జరుగుతుండగా.. కొన్ని ఏరియాల్లో
పూర్తయ్యాయి కూడా. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఉత్సవాలకు సంబంధించి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
గణపతి మండపాల ఏర్పాటుకు సంబంధించి నిర్వాహకులు ఆన్ లైన్ లో తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సిందిగా పోలీసులు సూచించారు. విద్యుత్ కనెక్షన్ కోసం కట్టాలని చెప్పారు. మండపాల కోసం సొంత విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకూడదని ఆదేశించారు. డీడీ తీసుకుని మాత్రమే కరెంటు కనెక్షన్ ఇవ్వాల్సిందిగా సూచించారు. అదే విధంగా మండపాల నిర్మాణం ఎలక్ట్రిషియన్లు, నిపుణలతో మాత్రమే వేయించాల్సిందిగా
సూచించారు.రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందున.. గాలివానకు తట్టుకునేలా పకడ్బందీగా మండపాలను నిర్మించుకోవాలని సూచించారు పోలీసులు. అదే విధంగా

ఉత్సవాల్లో పాల్గొనే భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఉత్సవాల సందర్భంగా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని
సూచించారు. మండపాల ఏర్పాటు, ఉత్సవాల నిర్వహణకు సంబంధించి పోలీసులతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు.
ఆన్ లైన్ పర్మిషన్ కోసం పోలీస్ అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించగలరు:

https://policeportal.tspolice.gov.in/index.htm

మండపాల పర్మిషన్ కొరకు ఆన్లైన్ ప్రాసెస్ వీడియో కొరకు కింద ఉన్న లింకును క్లిక్ చేయండి..

https://youtu.be/i8XkQb_4rFQ?si=Ww5SG3iLxOfpqTGj

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe