వికలాంగుడిని ఈడ్చుక వెళ్లిన ఘటనపై మండిపడ్డ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్

BB6 TELUGU NEWS  15 Aug 2025 :
జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో  వికలాంగుడిని ఈడ్చుక వెళ్లిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి వికలాంగుడిని ఈడ్చుక వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్ ను సిబ్బందిని ఘటనను చూసి స్పందించని జిల్లా కలెక్టర్ ను ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేసి వికలాంగుల హక్కుల చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ ఘటనకు కారణమైన వారిని సస్పెండ్ చేయకుండా విచారం వ్యక్తం చేస్తున్నామంటూ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రకటించడం బాధాకరమని వెల్లడి మంత్రికి వికలాంగుల సమాజంపై చిత్తశుద్ధి ఉంటే ఘటనకు కారణమైన కానిస్టేబుల్ ను జిల్లా కలెక్టర్ ను సస్పెండ్ చేయించాలని విజ్ఞప్తి*
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో వికలాంగులపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని భారత  వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు గురువారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి లో తన సమస్య చెప్పుకునేందుకు వచ్చిన మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన వికలాంగుడు మర్రిపెళ్లి గంగారాం ను అత్యంత దారుణంగా ప్రజావాణి నుంచి ఈడ్చుక వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్ మరియు సిబ్బంది తీరు బాధాకరమని తన కళ్ళముందే వికలాంగుడిని ఈడ్చుకు వెళుతున్న చూసి చూడనట్లు ప్రవర్తించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తీరు సమస్త వికలాంగుల సమాజాన్ని తీవ్ర మనోవేదనకు గురిచేస్తుందని వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్  రెడ్డి ఈ ఘటనపై స్పందించి వికలాంగుడిని ఈడ్చుక వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్ ను సిబ్బందిని మరియు ఘటనను చూసి స్పందించిన జిల్లా కలెక్టర్ ను వెంటనే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి వికలాంగుల హక్కుల చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన నాటి నుంచి నేటివరకు రాష్ట్రంలో వికలాంగులపై రోజురోజుకు దాడులు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో గ్రామస్థాయి అధికారుల నుంచి మొదలుపెడితే జిల్లా కలెక్టర్ స్థాయి వరకు అధికారులు అడుగడుగున  వివక్ష ప్రదర్శిస్తున్నారని ఎన్నికల ముందు తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తానని తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ స్థాయి నుంచి పోలీస్ కానిస్టేబుల్ వరకు వికలాంగులను అవమాన పరుస్తుంటే ఎందుకు చట్టాన్ని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చొరవ చూపటం లేదొ వికలాంగుల సమాజానికి సమాధానం చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూస్తుంది అని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయని ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటికీ అట్టడుగున ఉన్న వికలాంగుల సామాజిక వర్గానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించకపోవడంతో పాటు పరిశ్రమల రంగంలో గతంలో  వికలాంగులకు ఉన్న రిజర్వేషన్లు సహితం ఎత్తివేసేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకు వచ్చిన MSME పాలసీల్లో వికలాంగులకు రిజర్వేషన్ లేకుండా చేసిన తీరులే ఉదాహరణలు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా వికలాంగుల సమాజంపై వివక్షను విడనాడి రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ఆర్టీసీలో వికలాంగులకు 100% రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి  నోటిఫికేషన్లు విడుదల చేసి రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖకు ప్రత్యేక అధికారులను నియమించి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వికలాంగుల పెన్షన్ 6000 పెంచి వికలాంగుల సంక్షేమానికి పాటుపడడంతో పాటు 2024 డిఎస్సి లో ఎగ్జామ్ రాసి మెరిట్ స్కోర్ సాధించిన స్పెషల్ బీఈడీ అభ్యర్థులు 94 మందికి వెంటనే ఉద్యోగ నియామక పత్రాలు అందజేయాలని ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘం నాయకుడు వాకుడోత్ లాల్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు ఉస్మానియా యూనివర్సిటీ దివ్యాంగ JAC సంఘం నాయకుడు మారవేణి చంద్రశేఖర్ యాదవ్ స్పెషల్ బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర నాయకులు గజ్వేల్లి రమేష్ కృష్ణ కిషోర్ సతీష్ వాక్కుడోత్ లాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe