BB6 News Telugu 8 Aug 2025 : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని నేడు కాళికాదేవి దేవాలయం ఆవరణలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్, తాండూర్ నియోజకవర్గం అధ్యక్షులు రవికాంత్ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అద్యక్షులు లొంక నరసింహులు మాట్లాడుతూ.. పాలమూరు మట్టిలో పుట్టిన ముదిరాజు ముద్దుబిడ్డ పండుగ సాయన్న సేవలు అమోఘమని అన్నారు. ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజల కడుపు నింపడానికి పోరాటాలు చేస్తూ అమరుడైన గొప్ప త్యాగదనుడు పండుగ సాయన్న అని వారు కొనియాడారు.పండుగ సాయన్న 165వ జయంతి అయినప్పటికీ నేటికి కూడా పాలమూరు జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాల లోని ప్రజల హృదయాల్లో పండుగ సాయన్న చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. నిజం నిరంకుశపాలను భూస్వాముల పెతందారుల దొరల దోపిడీలను ఎండగట్టిన గొప్ప వీరుడు పండుగ సాయన్న అని తెలిపారు. హైదరాబాద్ రోడ్డు మార్గంలో కేటాయించిన స్థలంలో ముదిరాజ్ సంఘ సభ్యులు జెండా ఆవిష్కరణ నిర్వహించారు.అందరము ఐక్యమత్యంతో ఉండాలి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్,ఏబ్లాక్ అధ్యక్షులు లొంక నరసింహులు,తాండూర్ నియోజకవర్గం అధ్యక్షులు ఎస్పి రవికాంత్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ జర్నప్ప, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాతుల వెంకటేష్,ముదిరాజ్ సంఘ నాయకులు,తదితరులు పాల్గొన్నారు…
తాండూరులో కాళికాదేవి దేవాలయం ఆవరణలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పండుగ సాయన్న జయంతి

08
Aug