BB6 TELUGU NEWS : 6 Aug 2025 :
మోడీ మెడలు వంచేందుకే ఢిల్లీలో ధర్నా.. బీసీ బిల్లులకు ఆమోదం తెలపకపోతే గద్దె దింపుతం
సీఎం రేవంత్బీసీ రిజర్వేషన్ బిల్లులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపకపోతే.. ప్రధానిమోడీని గద్దె దించి, రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకుని బీసీ రిజర్వేషన్లను సాధించుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
42% బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్దపోరుబాట ధర్నాలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి
ప్రధాని మోదీ (PM Modi), భాజపా (BJP) నేతలు బీసీ రిజర్వేషన్ (BC Reservations) బిల్లులను అడ్డుకొని బలహీనవర్గాలకు అన్యాయం చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) అన్నారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు ఇస్తామంటే గుజరాత్ వారికి కడుపుమంట ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు.దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన బీసీ ధర్నాలో సీఎం మాట్లాడారు. గల్లీలో ఉండలేక దిల్లీలోనే తేల్చుకుందామని ‘చలో దిల్లీ’ చేపట్టామని చెప్పారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎలాగైనాసాధిస్తామన్నారు. దిల్లీలో ధర్నాకు వంద మంది ఎంపీలు, ఇండియా కూటమి పార్టీలు మద్దతు ఇచ్చాయన్నారు.”బీసీ రిజర్వేషన్ల కోసం 4 కోట్ల మంది ముక్త కంఠంతో విజ్ఞప్తి చేశారు. జంతర్ మంతర్ వేదికగా మోదీ,ఎన్డీయేకు సవాల్ విసురుతున్నా. మా డిమాండ్లను ఆమోదిస్తారా? మిమ్మల్ని గద్దె దించాలా? మాఆలోచనలు, బిల్లులను తుంగలో తొక్కే అధికారం మీకు ఎవరిచ్చారు? మోదీ మన బద్ధశత్రువు..బలహీనవర్గాలకు న్యాయం చేసే ఆలోచన ఆయనకు లేదు. ఆయన మోచేతి నీళ్లు తాగే కిషన్ రెడ్డి, బండిసంజయ్, రామచంద్రరావుకు ఏమైంది? తెలంగాణలో మీరు బలహీన వర్గాలను ఓట్లు అడగలేదా? ప్రజలతో మీఅవసరం తీరిపోయిందా? పేరు బంధం తెగిన తెరాస(ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి).. పేగు బంధం కూడా తెలంగాణతో తెగిందా? “అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
